మెగాస్టార్ చిరంజీవి కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మెగా అభిమానులు అందరికీ ఎక్కువగా గుర్తుండిపోయే సినిమా ఏది అంటే... మెగా అభిమానులు నిరీక్షణ తీరుస్తూ సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సంవత్సరాల పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమైనప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు అని నిరూపించిన సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా. 

 

 అందుకే మెగా అభిమానులందరి ఖైదీ నెంబర్ 150 సినిమా ఎప్పుడు ఫేవరేట్ గా నిలుస్తూ ఉంటుంది. అయితే ఖైదీ నెంబర్ 150 సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దొంగ పాత్రలో నటించి తనదైన కామెడీతో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒక బాధ్యత గల వ్యక్తి పాత్రలో నటించి ప్రేక్షకులు అందరిని మెప్పించాడు. అయితే సినిమాలకు కొన్నేళ్లపాటు దూరం అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం ఇప్పటివరకు తగ్గలేదు అని మరోసారి నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. 

 

 

 అయితే చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమా తమిళ సినిమా రీమేక్ గా వచ్చింది.తమిళ సినిమాలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమా రీమేక్ ఖైదీ నెంబర్ 150 సినిమా. విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమా తమిళంలో ఎలాంటి  విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవికి ఉన్న క్రేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు వి.వి.వినాయక్. చిరంజీవి 150వ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: