అవును.. కొన్ని సినిమాలు చాలా బాగుంటాయి. హీరో కామెడీ.. హీరోయిన్ యాక్టింగ్, కథ, స్క్రీన్ ప్లే అన్ని బాగుంటాయి. కానీ ప్లాప్ అవుతాయి. ఎందుకు ప్లాప్ అయ్యాయో ఎవరికి అర్థం కాదు. థియేటర్ లో ఆ సినిమా ఎవరు చూడరు. కానీ టీవీ లో వేస్తే మాత్రం ఓ చూసేస్తారు. ఓ రేంజ్ లో టీఆర్పీని తెస్తారు. అప్పుడు అంటారు వీక్షకులు.. సినిమా బాగుంది కదా! ఎందుకు ప్లాప్ అయ్యింది అని. అప్పుడు అంటే మాత్రం హీరో ఖాతాలో హిట్ పడుతుందా? నిర్మాత జేబులో డబ్బు పడుతుందా. ఏది ఏమితేనం అలా వెండితెరపై డిజాస్టర్లు అయ్యి బుల్లితెరపై బ్లాక్ బస్టర్లు అయినా సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి..

 

ఖలేజా..   

 

IHG

 

మహేష్ బాబు హీరోగా, అనుష్క హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాగున్నప్పటికీ.. థియేటర్ లో హ హహా అని నవ్వినప్పటికీ చివరికి సినిమాను ప్లాప్ చేశారు.. కానీ ఆ సినిమా టీవిలో రాగానే భలే తీశాడు గురు జీ అని పొగిడారు. 


జల్సా..  

 

IHG

 

ఇది కూడా గురు జీ సినిమానే. అయితే ఏంటి? పవన్ కళ్యాణ్ అదృష్టం అలా ఉండే.. అందుకే సినిమా యావరేజ్ అనిపించుకుంది. కానీ బుల్లితెరపైనా మాత్రం సూపర్ హిట్ అయ్యింది. 

 

రాఖి..  

 

IHG

 

ఆడపిల్లపై అత్యాచారం జరిగి ఆ న్యూస్ హైలెట్ అయితే కోసెయ్యాలి ఒక్కొక్కడికి అని డైలాగులు చెప్పే ప్రజలు ఆ విషయం గురించే వచ్చిన సినిమాను చూడలేదు. కానీ టీవిలో బాగానే చూశారులెండి. 

 

ఎవడు..  

 

IHG

 

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే బుల్లితెరపైనా మాత్రం బాగానే హిట్ అయ్యింది. 

 

జాను..  

 

IHG

 

తమిళ్ లో సూపర్ హిట్ అయినా ఈ సినిమా తెలుగులో అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే మొదటిసారి బుల్లితెరపై వేసినప్పుడు మాత్రం ఓ రేంజ్ లో టీఆర్పీ సాధించింది. 

చూశారుగా.. ఇవి అండి బుల్లితెరపై బ్లాక్ బస్టర్ లు.. వెండితెరపై డిజాస్టర్లు..  

మరింత సమాచారం తెలుసుకోండి: