తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా వచ్చిన సినిమాల్లో  కొన్ని సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటాయి. ఆ సినిమాలను ఎన్నిసార్లు చూడటానికి అయినా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. 




ఎందుకంటే స్టోరీ పరంగా... ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టదు. ఇలా సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా అలరిస్తుంది డార్లింగ్ సినిమా. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంత మంచి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.




 ఇక ఈ సినిమా స్టోరీ పరంగా ఎమోషన్స్ పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రభాస్ మధ్య సాగిపోయే లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఉండే డైలాగులు కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకర్షించాయి అని చెప్పాలి. ఇక డార్లింగ్ సినిమా లో కాజల్ అగర్వాల్ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కాజల్ అగర్వాల్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. 





అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చెప్పిన ఒక్క డైలాగు మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోయింది. ప్రభాస్ ఒక సన్నివేశంలో కాజల్ అగర్వాల్ ని లూస్ అని అంటాడు. దీనికి తెగ ఫీల్ అయిపోయినా కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి... వాడు నన్ను లూజ్ అన్నాడే అంటూ బాధపడుతుంది. అయితే కాజల్ అగర్వాల్ ఎంతో క్యూట్ క్యూట్ గా ఈ డైలాగ్ చెప్పడం తో తెలుగు ప్రేక్షకులను తెగ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇక ఈ డైలాగ్ తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో ఎన్నో రోజుల పాటు నానింది. ఇక ఈ ఒక్క డైలాగ్ కాజల్ అగర్వాల్ కు  మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: