పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ దేవరకొండ, ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరోగా మంచి పేరు దక్కించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో విజయ్ కు జోడిగా రీతూ వర్మ నటించింది. ఆంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో విజయ్ టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన విజయ్, తన సహజ నటనతో యువత మనసులు గెలుచుకున్నాడు. 

 

ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై తెరకెక్కిన గీతా గోవిందం లో హీరోగా నటించిన విజయ్, దానితో కూడా సూపర్ సక్సెస్ అందుకుని హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత నుండి వరుసగా ఆఫర్లతో దూసుకెళ్తున్న విజయ్, ప్రస్తుతం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, తన తదుపరి సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్న విజయ్, ఆ సినిమా ద్వారా ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారట. 

 

అలానే గతంలో విజయ్ తో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జతకట్టిన రష్మిక మందన్న, మరొక్కసారి ఈ సినిమా ద్వారా విజయ్ సరసన నటించనుందని టాక్. మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా, ఆకట్టుకునే పలు ఎంటర్టైనింగ్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ముచ్చటగా మూడోసారి వెండితెరపై విజయ్, రష్మిక ల జంటని చూడవచ్చన్నమాట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: