వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ఒకేసారి ముప్పేట దాడికి రంగం సిద్దం అవుతోంది. అనునిత్యం వార్తలలో ఉండడానికి తన సినిమాలకి కాంట్రవర్సీ టైటిల్స్ పెట్టి డబ్బులు దండుకోవడానికి వర్మ అనుసరిస్తున్న వ్యూహాల పై ఒకేసారి టాలీవుడ్ లో అసహనం దావానంలా పెరిగిపోతోంది.
మరో మూడురోజులలో విడుదలకాబోతున్న ‘పవర్ స్టార్’ మూవీ రిజల్ట్ తెలియకుండానే ఒకేసారి చాలామంది వర్మను ఇరుకున పెట్టడానికి గట్టిప్రయత్నాలు ఒకేసమయంలో మొదలుపెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఒక మెగా వీరాభిమాని వర్మను టార్గెట్ చేస్తూ తీసిన షార్ట్ ఫిలిం ‘పరాన్నజీవి’ పవర్ స్టార్ మూవీ విడుదల రోజునే విడుదలచేయడానికి గట్టిప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన ‘పరాన్నజీవి.. జీవి నిర్జీవి ఆర్జీవీ..' అంటూ సాగే పాట విడుదలై సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. ‘పవర్ స్టార్ తో ఆడకు ఆట.. మొదలైనట్టే సింహపు వేట’ అంటూ సాగే ఈపాట కీలకంగా ఉండబోయే ‘పరాన్నజీవి’ మూవీ ‘పవర్ స్టార్' కి పోటీగా జూలై 25న విడుదల కాబోతోంది. ఈసినిమా మాత్రమే కాకుండా 'పార్న్ జీవి' అనే మరోసినిమా కూడా అనౌన్స్ చేసారు. సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి 'పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈసినిమాలతో పాటు ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీసిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) అనే సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిచాలదు అన్నట్లుగా వర్మను టార్గెట్ చేస్తూ త్వరలో ఒక వెబ్ సిరీస్ కూడ ‘డేరా బాబా’ అనే టైటిల్ తో రాబోతోంది అనేలీకులు వస్తున్నాయి. ఈవెబ్ సిరీస్ లో పవన్ కళ్యాణ్ వీరాభిమాని షకలక శంకర్ ప్రధాన పాత్రలో నటించబోతున్నాడని టాక్. అయితే ఈముప్పేట దాడి కొనసాగుతూ కొనసాగుతూ ఉండగానే వర్మ తన పవర్ స్టార్ మూవీని చాలఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా పవర్ స్టార్ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘గడ్డి తింటావా’ పాటకు 1.6 మిలియన్ వ్యూస్ 69 వేల లైక్ లు 52 డిజ్ లైక్ లు నిన్నటి ఉదయం వరకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఒక మీడియా సంస్థ పవర్ స్టార్ మూవీ పై చేసిన ఆన్ లైన్ సర్వేలో సుమారు 57 శాతంమంది ఈసినిమాను టిక్కెట్ పెట్టి చూడము అని చెపుతున్నట్లు సర్వే ఫలితాలు వస్తున్న పరిస్థితులలో వర్మ ఊహించిన స్థాయిలో పవర్ స్టార్ మూవీకి కాసులు కురవకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి