టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 2015లో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. తొలిసారిగా కొరటాలతో మహేష్ పని చేసిన ఈ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్  కొట్టి, అంతకముందు కెరీర్ పరంగా ఫ్లాప్స్ లో ఉన్న మహేష్ కు పెద్ద బ్రేక్ ని అందించింది. ఊరిని దత్తత తీసుకోవడం అనే సోషల్ మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు కొరటాల తెరకెక్కించిన ఈ సినిమాలో ధనికుడైన హర్ష అనే యువకుడి పాత్రలో మహేష్ బాబు అత్యద్భుత నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు.


శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. మహేష్, శృతిల జంట అదరగొట్టే  పెర్ఫార్మన్స్, మంచి సోషల్ మెసేజ్, అదిరిపోయే యాక్షన్, మాస్ సీన్స్,  ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, సాంగ్స్ వంటివి ఈ సినిమా సక్సెస్ లో ప్రధాన భూమిక పోషించాయి. ఇక అప్పట్లో ఈ సినిమాని తమిళ, హిందీ భాషల్లో రిమేక్ చేస్తున్నట్లు పలు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఆ తరువాత వాటిపై ఎటువంటి ప్రకటన రాకపోవడంతో వాటిని విరమించుకున్నారని అందరూ భావించారు.


అయితే లేటెస్ట్ గా పలు బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, అతి త్వరలో ఈ సినిమాని బాలీవుడ్ లోని ఒక అగ్ర నిర్మాణ సంస్థ, స్టార్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా రీమేక్ చేయనుందని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ సినిమాని చేయాలని భావించిన హృతిక్, అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కారణంగా అగారని, ప్రస్తుతం నటిస్తున్న క్రిష్ 4 అనంతరం, ఈ సినిమా రీమేక్ ని పట్టాలెక్కించాలని ఆయన చూస్తున్నారట. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు గాని, ఒకవేళ నిజమే అయితే మాత్రం అటు సూపర్ టార్ ఫ్యాన్స్ కి, ఇటు హృతిక్ ఫ్యాన్స్ కి, ఇది పండుగ న్యూస్ అని చెప్పవచ్చు.....!!

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: