నిత్యా మీనన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. న్యాచురల్ స్టార్
నాని హీరోగా తెరకెక్కిన `అలా మొదలైంది` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన
నిత్యా మీనన్.. తెలుగు ప్రేక్షకులను ఈజీగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించి మంచి విజయం అందుకుంది.

ఈ చిత్రం తర్వాత నితిన్‌కు జోడీగా `ఇష్క్` సినిమాలో నటించి మరో విజయాన్ని అందుకుంది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన
గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ.. మంచి విజయాలను అందుకుంది.

ఇక తెలుగు సినిమాలతో పాటు.. అటు మలయాళ సినిమాల్లోనూ నటింటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే అన్ని సినీ ఇండస్ట్రీలలో ఈ అమ్మడు స్టార్
హీరోయిన్ స్టేటస్ లభించేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. ఈ బ్యూటీని ఇష్టపడేవారు చాలా మందే ఉన్నారు.

మరోవైపు
నిత్యా మీనన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. యూత్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా
నిత్యా మీనన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు కూడా లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.





