టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అడుగుజాడలలో సురేంద్ర రెడ్డి నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ‘రేసుగుర్రం’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న సురేంద్ర రెడ్డి ‘మగధీర’ సినిమా సూపర్ హిట్ తరువాత సునీల్ తో చిన్న సినిమా ‘మర్యాద రామన్న’ చేసినట్లుగా సురేంద్ర రెడ్డి కూడ తన తరువాత సినిమాను కొత్త కుర్రాళ్ళతో రూపొందించడానికి రెడీ అవుతున్నాడు అని ఫిలింనగర్ టాక్. ఓ బ్లాక్ బస్టర్ సినిమా తరువాత చిన్న సినిమా తీయడం అంటే ఓ సాహసమే. కానీ ‘రేసుగుర్రం’ తరువాత వెంటనే రవితేజా ‘కిక్ - 2 ’ సినిమాకు వెళితే అంచనాలు పెరిగిపోయి పరాజయం వచ్చే అవకాసం ఉంది కాబట్టి ఈ కొత్త నటీనటుల సినిమాను సురేంద్ర రెడ్ది ఎంచుకున్నాడు అని అంటున్నారు. కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ లో వినోదాత్మక ప్రేమకథా చిత్రంగా దీనిని రూపొందించడానికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడట సురేంద్ర రెడ్డి. అయితే ఈ సినిమాతో పాటే ‘కిక్ - 2 ’ సినిమాకు సంబంధించిన పనులు కూడ సురేంద్ర రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది ‘కిక్' చిత్రానికి సీక్వెల్ కాదు. కిక్ చిత్రంలోని సెంట్రల్ క్యారెక్టర్లను తీసుకుని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాను అని అంటున్నాడు సురేంద్ర రెడ్డి. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలలో ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ‘కిక్-2' సినిమా కళ్యాణ్ రామ్ కు డూ అండ్ డై సినిమాగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: