
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెబుతూ జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన చైతన్య పవర్ స్టార్ సైకత శిల్పాన్ని రూపొందించారు. వంశధార నది, సాగరతీరం కలయిక ప్రాంతమైన కళింగపట్నం లో పవన్ రూపాన్ని ఇసుకతో రూపొందించడం జరిగింది. ఈ సైకత రూపం అందర్నీ ఎంత గానో ఆకట్టుకుంది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పిక్చర్ మాత్రం అందర్నీ ఎంత గానో ఆకట్టుకుంటోంది. సాఫ్ట్ బాల్ స్టిక్ పట్టుకుని పవన్ నిలబడిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.మామూలుగా అయితే వకీల్ సాబ్ చిత్రం సమ్మర్ లోపే రిలీజై బాక్సాఫీస్‌ను అదరగొట్టాల్సింది. అందుకు అనుగుణంగా పవన్ కళ్యాన్ షూటింగ్‌లో పాల్గొని పూర్తి చేశాడు. అయితే చివరి దశకు చేరుకున్నా కరోనా అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ కారణంగా పూర్తి షూటింగ్ పూర్తవుతున్నాసెట్స్ పైకి పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమా రానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి