ఇటీవలే ఓ మహిళా తనపై పోలీసులు అత్యాచారం చేశారు అంటూ ఆరోపణలతో కేసు పెట్టడం సంచలనంగా మారింది. కేసు విచారణలో అసలు నిజం బయట పడడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ముంబైలో నివాసం ఉండే ఓ మహిళ తనను ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్.. ఆటో డ్రైవర్ రేప్ చేశారని... న్యాయం చేయాలి అంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరు కానిస్టేబుళ్లు విచారణ పేరిట తనను పిలిచి దారుణంగా అత్యాచారం చేశారంటూ ఆరోపించింది. సదరు మహిళ ఆరోపణలు సంచలనం గా మారిపోయాయి.




 అంతే కాదు ఇలా పోలీసులు అత్యాచారం చేయడం వల్ల తనకు గర్భస్రావం అయింది అంటూ ఫిర్యాదులో తెలిపింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. కేసును  ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఇక ఈ పోలీసు విచారణలో ఎన్నో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. ఇక అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్ల తో పాటు ఆటో డ్రైవర్ కూడా... మహిళపై అత్యాచారం చేయలేదు అన్న విషయం విచారణలో తేలింది.



 దీంతో మహిళను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అయితే పోలీస్ విచారణలో సదరు మహిళ.. అసలు నిజాన్ని అంగీక రించింది తనపై ఎవరు అత్యాచారం చేయలేదని కుట్రపూరితంగా ఇదంతా చేసినట్లు తెలిపింది.  అంతేకాకుండా.. దీని వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నాడు అన్న విషయాన్ని విచారణలో తెలిపింది  సదరు మహిళ. అయితే సదరు మహిళ ఇలా తప్పుడు ఆరోపణలు చేసి కేసు పెట్టేలా చేసిన మరో పోలీసు అధికారి పై కూడా కేసు నమోదైంది. కాగా అతడిని అరెస్టు చేసేందుకు కూడా ప్రస్తుతం పోలీస్ అధికారులు సిద్ధమయ్యారు. ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: