పవన్  కళ్యాణ్ వీరాభిమానులు అకిరా నందన్ హీరోగా ఫిలిం ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. దీనికితోడు అకిరా నందన్ హైట్ కూడ ఆరు అడుడుగులు దాటి ఉండటంతో మెగా హీరోలలో బాగా పొడుగుగా ఉండే హీరోగా అకిరా నందన్ రికార్డు క్రియేట్ చేస్తాడని పవన్ అభిమానులు ఇప్పటి నుంచే జోష్ లోకి వెళ్ళి పోతున్నారు.


అయితే ఇప్పుడు వారి కలలకు నిహారిక భర్త చైతన్య జొన్నల గడ్డ చిల్లు పెట్టాడా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ పడుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయ్ పూర్‌ లో గ్రాండ్‌ గా నిహారికను పెళ్ళి చేసుకోబోతున్న చైతన్య ఫోటోలను అతడి లుక్ ను చూస్తున్న వారు ఈ మెగా అల్లుడు కూడ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే కామెంట్స్ వస్తున్నాయి.    


ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిహారిక భర్త చైతన్యకు సంబంధించిన ఫోటోలలోని లుక్ మరియు అతడి హైట్ ను చూసి చాలామంది షాక్ అవుతున్నారు.  ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చితన్య మెగా హీరోల గాలి తగలగానే వెంటనే హీరో అయిపోవడం ఖాయం అని అంటున్నారు. మరికొందరు అయితే హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలి అని కలలు కన్న నిహారిక కలలు నెరవేరక పోవడంతో నిహారిక కలలను తీర్చి హీరోగా చైతన్య రాణించడం ఖాయం అని కూడ అంటున్నారు.  




ఏది ఎలా చూసుకున్నా ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలలో వరుణ్ తేజ్ బాగా పొడువు. అయితే అకిరా నందన్ కూడ వరుణ్ తేజ్ హైట్ ను దాటిపోయే అవకాశాలు  కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరిద్దరు వీరి బావ హైట్ ముందు నిలబడలేరు  అని చెపుతూ మరికొందరు జోక్స్ పేలుస్తున్నారు. మరికొందరు అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ స్టైలిష్ కపుల్ గా రామ్ చరణ్ ఉపాసన లు ఉండేవారు అని ఇప్పుడు ఆ రికార్డు నిహారిక చైతన్య లు ఆక్రమిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: