మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ లో పాగా వేసి తెలుగు ప్రేక్షకులను సైతం తన మాయలో పడేసింది హీరోయిన్ సమంత. కింద స్థాయి నుండి స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఆమె చాలా కష్టాలు చూసింది. ఇప్పుడు అక్కినేని వంటి టాప్ ఫ్యామిలీకి కోడలుగా మారి సమంత తన రేంజ్ ని మరింత పెంచుకుంది. 



పెళ్లి అయిన తర్వాత కూడా తన అందాల ఆరబోతకు ఎలాంటి ఫుల్ స్టాప్ పడలేదు కాబట్టి ఆమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాల మంది హీరోయిన్స్ పెళ్లయిందంటే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి పక్కకు వెళ్లిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ సమంత మాత్రం అందాన్ని పెంచుకుంటూ టాలీవుడ్ లో పాగా వేసిందని చెప్పుకోవచ్చు.


సినిమా ఒక్కటే కాదు అంతకు మించి


కేవలం ఒక్క సిల్వర్ స్క్రీన్ పైననే కాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం యాంకరింగ్, హోస్టింగ్ మరియు వెబ్ సిరీస్ ల పైన దృష్టి పెట్టి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది. ఇక సామ్ తన బర్త్ డే కి మాల్దీవులకు వెళ్లగా అక్కడ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది. ప్రతి రోజు తన దిన చర్య ఎలా ప్రారంభమవుతుందో అనేదానిపై క్లారిటీ ఇచ్చింది. షూటింగ్స్ ఉన్న లేకపోయినా తన ప్రతి రోజు ఒకేలా ఉంటుందని వెల్లడించింది. జాగింగ్ తో మొదలు పెడుతూ జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతాను అంటూ చెప్పుకోచ్చింది. 



ప్రతి రోజు మూడు గంటల పాటు వర్క్ ఔట్స్ చేస్తే కానీ తన డే బాగుండదని, ఉదయాన్నే 5 గంటలకు లేవడం తనకు అలవాటు అంటూ చెప్పుకొచ్చింది సామ్. ఇలా తన గ్లామర్ సీక్రెట్ ఏంటో బయట పెట్టేసాక సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు. లేట్ నైట్ పార్టీస్, పబ్స్, డ్రింక్స్ అంటూ తిరిగే ఈ రోజుల్లో సమంత డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.



ఇక సమంత సేంద్రీయ వ్య‌వ‌య‌సాయం పై కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. తన మేడపైన వ్యవసాయం చేస్తూ, అందుకోసం చాల సమయం వెచ్చిస్తుందట. ఇలా తన ప్రతి రోజు ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న సమంత ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తుండగా, ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో సైతం నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: