దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాల్సిందేనని అభిమానులు ఆరాటపడుతుంటారు. ఈ దర్శకుడితో సినిమాలో నటించే ఏ ఒక్క అవకాశం వచ్చినా వదులుకునే నటీనటులు ఉండరేమో. క్రియేటివిటీగా ఆలోచిస్తూ ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాను తెరకెక్కించడంలో ఈ దర్శకుడికి పోటీ ఎవరూ లేరనిపిస్తుంటుంది. అదీ నిజమే కదా.. ఈ దర్శక ధీరుడు తీసిన సినిమాలన్నీ కలెక్షన్ల వర్షం కురిస్తాయి మరి. అంతే కాదు ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ జక్కన్న. 
అలాగే భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించడంలో కూడా ఈయనే ముందుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణగా మనం ఆరడుగుల అందగాడు ప్రభాస్ తో బాహుబలి 1, 2 సినిమాలే నిదర్శనం. ఈ సినిమాలు బాక్సీపీసు వద్ద కాసులను ఏవిధంగా సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిరువురి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కి ప్రేక్షకులను అబ్బురపరిచింది. 
దాంతో మళ్లీ ఈ జక్కన్న, ప్రభాస్ కాంబినేషన్ లో ఓ మూవీ వస్తే చూడాలని ప్రేక్షకులంతా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనే వార్త వినడానికి అటు జక్కన్న అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చిందండోయ్. ఇంకేముంది ఇది వీరిరువురి అభిమానులకు శుభవార్తే కదా.. ఈ విషయంపైనే జక్కన్న తాజాగా చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. 
ఇటీవలె ఈ విషయంపై రాజమౌళిని అడగగా దానికి ఆయన వామ్మో మా కాంబినేషన్ సినిమానా .. ప్రభాస్ తో నేను మళ్లీ సినిమా తీస్తే జనాలు బెదిరిపోతారు బాబోయ్ అని సరదాగా కామెంట్ చేశారట ఈ దర్శక ధీరుడు. బాహుబలి సినిమానే ఐదేళ్లు తీసాం. మళ్లీ మేమిద్దరం కలిసి సినిమా తీస్తే చాలా టైమే పడుతుందని నవ్వారు. అయితే నాకు హీరో ప్రభాస్ తో కలిసి సినిమా తీసే అవకాశం వస్తే తప్పకుండా తీస్తానని ఆయన తెలిపారు. మంచి కథ ఒక్కటి ఉంటే ఖచ్చితంగా మా కాంబినేషన్ లో సినిమా వస్తుందని జక్కన్న హామీనిచ్చారు. చూడాలి మరి వీరువురి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: