తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల పట్ల అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే తన అభిమాన హీరో సినిమా ఒకటి వస్తుందంటేనే హుషారెత్తిపోయే ఫ్యాన్స్ కి.. ఆ స్టార్ హీరోతో పాటుగా మరో స్టార్ హీరో కలిసి సినిమా తీస్తున్నారంటే ఇంకా ఫ్యాన్స్ కి పండగే అవుతుంది కదా.. ఇప్పుడు కూడా ఆ స్టార్స్ ఫ్యాన్స్ కి పండగేనండోయ్.. వీరిరువురి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అని తెలిసినప్పటి నుంచి ఆ హీరోస్ ఫ్యాన్స్ కి ప్రతిరోజూ పండగగానే అయిపోయింది మరి. ఇంతకి ఏ స్టార్స్ కాంబినేషన్ లో వస్తుందనుకుంటున్నారు.. మీకు తెలిసిందేనండి.. పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని వార్తలు గుప్పుమంటున్నాయి కదా.. దాని పట్ల ఆ స్టార్ హీరోల అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. 

అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత తెరమీదకు రాబోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే ఆనందం మరింత రెట్టింపయిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ హీరో అటు రాజకీయాల్లో ఉంటూనే.. ఇటు సినిమాలో పాల్గొనడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా పోతే.. వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ‘సరిలేరు నీకెవ్వరు’అంటూ ఈ ఏడాదికి బ్లాక్ బస్టర్ గుర్తింపును తీసుకొచ్చాడు. దాంతో ఆగకుండా సర్కారి వారి పాట తో తన అభిమానుల ముందుకు రావడానికి సంసిద్ధమవుతున్నాడు ఈ శ్రీమంతుడు. అయితే సూపర్ స్టార్, పవర్ స్టార్ కలిసి ఓ సినిమా రాబోతోందని వార్తలు షికార్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్త ఇటు ఈ శ్రీమంతుని ఫ్యాన్స్ కు, అటు అజ్ఞాతవాసి ఫ్యాన్స్ కు ఒక తీపి కబురేనని చెప్పుకోవచ్చు. 

మల్టీ స్టారర్ సినిమాలంటేనే పిచ్చ ఇష్టముండే ప్రేక్షకులకు ఈ స్టార్ హీరోస్ కలిసి చేస్తున్నారంటే అది ఒక ఏడో వింతగా చూస్తున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో కాదో కూడా నిన్నటి వరకు తెలియదు. కానీ రీసెంగ్ వీరిరువురు స్టార్స్ కలిసి నిజంగానే ఓ సినిమాలో చేస్తున్నారన్న వార్త అధికారికంగా ప్రకటించబడింది. ఇంకేముంది వీరిరువురి ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయితే మహేశ్ హీరోగా నటించనున్న సర్కారి వారి పాట లోనే పవన్ నటించబోతున్నాడు.  ఈ సినిమాలో పవన్ కేవలం ఐదే ఐదు నిమిషాలు కనిపించనున్నాడట. కాని ఆ పాత్రతో సర్కారి వారి పాటను ఓ మలుపుకు తిప్పబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. అలాగే పవన్ నటించే క్యారెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండబోతోందని డైరెక్టరే స్వయంగా చెప్పడం విశేషం. అందుకే పవన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పాడట. ఇంకేముంది ప్రముఖ పాత్రలో పవన్, హీరోగా సూపర్ స్టార్ మహేశ్ కాంబినేషన్ రాబోతున్న ఈ సర్కారీ వారి పాట కోసం అభిమానులు వీరి రాక కోసం వేయ కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: