మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా  ‘ఆచార్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  నిరంజన్ రెడ్డి కలిసి  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఒక  కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమా ప్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ ఎపిసోడ్‌లో చరణ్ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందట. ఇందులో చరణ్‌ పక్కన నటించే హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉండటంతో దర్శకుడు కొరటాల శివ ఆ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆ హీరోయిన్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా సెట్ అవ్వట్లేదు.

కియారా అద్వానీ అని ప్రచారం సాగింది. కాని అది వర్క్ అవుట్ కాలేదు. మళ్ళీ రష్మిక మందన అన్నారు కాని ఆమె కూడా ఇప్పుడు చేయట్లేదని కన్ఫార్మ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ వేటలో పడ్డాడు కొరటాల శివ. మళ్ళీ ఒక మంచి హీరోయిన్ కోసం బాలీవుడ్ లో గాలింపు మొదలు పెట్టాడట. ఒక మంచి బాలీవుడ్ హీరోయిన్ దొరికితే చరణ్ పక్కన జోడీగా పెట్టె ఆలోచనలో ఉన్నారట. ఇక మెగా పవర్ స్టార్ పక్కన నటించి ఆ లక్కీ ముద్దుగుమ్మ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: