టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అని అనిపించుకున్న స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ కి జనాల్లో ప్రత్యేకించి యూత్ లో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. 'పెళ్లి చూపులు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. 'డియర్ కామ్రేడ్', 'టాక్సీవాలా' వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు విజయ్. అభిమానులు ఈ స్టార్ ని 'రౌడీ' అని ఇష్టంగా పిలుచుకుంటారు. ఈ టాలెంటెడ్ స్టార్ కి లేడీస్ లో తెగ  ఫాలోయింగ్ ఉంది.



అయితే, విజయ్ రియల్ లైఫ్ లో కూడా హీరో అని అనిపించుకున్నాడు. లాక్ డౌన్ జరుగుతున్నప్పుడు రోజువారి వాడే సరుకులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడిన కొన్ని ఫ్యామిలీస్ కి సరుకులు అందించి ఆదుకున్నాడు. 'మిడిల్ క్లాస్ ఫండ్' పేరుతో కొన్ని కుటుంబాలను లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నాడు విజయ్ దేవరకొండ.



విజయ్ దేవరకొండ చేసిన సహాయాన్ని స్వప్నిక అనే పేరుగల ఒక దివ్యాంగురాలు కూడా అందుకొంది. స్వప్నిక శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమ్మాయి. విజయ్ తనకు చేసిన సహాయంకు కృతజ్ఞతా భావంతో విజయ్ బొమ్మను గీసింది. తాను గీస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్వప్నిక. విజయ్ దేవరకొండ బొమ్మను స్వప్నిక గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నోటితో పెన్సిల్ పట్టుకొని స్వప్నిక... విజయ్ దేవరకొండ బొమ్మను గీసింది.  



స్వప్నిక టాలెంట్ చూసి ఫిదా అయిన విజయ్ దేవరకొండ ఈ వీడియోపై  స్పందించాడు. 'లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక... నువ్వు మాకు ఇన్స్పిరేషన్' అని పోస్ట్ చేశాడు.



ప్రస్తుతం విజయ్ 'ఫైటర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మళ్ళీ మొదలవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: