టాప్ హీరోలకు అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నట్లుగా వారి పై నెగిటివ్ ప్రచారం చేసే వారు కూడ చాలామంది ఎక్కువగా ఉంటారు. దీనికితోడు టాప్ హీరోల మధ్య విపరీతమైన పోటీ పెరిగిపోవడంతో అభిమానులు ప్రత్యర్ధి హీరోల సినిమాలలో ఏ ఒక్క నెగిటివ్ పాయింట్ ఎప్పుడు దొరుకుతుందా అంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ‘పుష్ప’ మూవీ పై ప్రచారంలోకి వచ్చిన ఒక నెగిటివ్ గాసిప్ ఏకంగా సుకుమార్ దృష్టి వరకు వెళ్ళి సుకుమార్ ఎలర్ట్ అయ్యేలా చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీ కథ ఎక్కువ భాగం అరణ్యంలో జరిగే నేపధ్యంలో ఈ మూవీని దట్టమైన అరణ్యంలోనే సహజంగా తీయాలని ఎప్పటినుంచో సుకుమార్ భావిస్తున్నాడు.
మొదట్లో థాయిలాండ్ అడవులు ఆతరువాత శేషాచలం అడవులు అనుకుని చిట్టచివరకు తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలోని అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసారు. అయితే కరోనా అడ్డు తగలడంతో ఈమూవీ షూటింగ్ మొదలు పెట్టడమే ఆలశ్యం అయింది. ఈమధ్య ధైర్యం చేసి షూటింగ్ మొదలుపెట్టి కొన్ని రోజులు గడిచాక యూనిట్ లో కొందరికి కరోనా రావడంతో ఈ షూటింగ్ ను తీయడం మళ్ళీ వాయిదా వేసారు .దీనితో సుకుమార్ రామోజీ ఫిలిం సిటీలోనే ఒక కృత్రిమ ఫారెస్ట్ ను క్రియేట్ చేసి అక్కడ షూటింగ్ కొనసాగించడానికి ఏర్పాటుచేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ కృత్రిమ ఫారెస్ట్ కోసం ‘పుష్ప’ టీమ్ ఏకంగా భారీ చెట్లను నరికీ ఆ చెట్ల కొమ్మలతో రామోజీ ఫిలిం సిటీలో ఆర్టిఫిషియల్ అరణ్యాన్ని సృష్టిస్తున్నారు అంటూ హడావిడి చేసిన గాసిప్పులు సుకుమార్ దృష్టి వరకు వెళ్ళడమే కాకుండా అతడికి కలవర పాటుకు గురి చేసినట్లు టాక్. దీనికి కారణం అరణ్య ప్రాంతాలలో చెట్లు నరకటం నేరం. ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలర్ట్ అయిన సుకుమార్ ‘పుష్ప’ కోసం ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ క్రియేషన్ లేదని ఈమూవీ షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో జనవరి 5 నుండి ఎటువంటి బ్రేక్ లేకుండా ఒక నెల పాటు అక్కడే షూట్ చేస్తాము అంటూ సుకుమార్ ప్రచారం లో ఉన్న గాసిప్పులను ఖండిస్తూ తన సన్నిహితులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి