
ఇక బాలయ్య ఈ మూవీలో రెండు రకాల విభిన్న పాత్రల్లో నటిస్తుండగా ఆయనకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. అయితే దీని తర్వాత బాలయ్య ఎవరి సినిమా చేస్తారు అనే దానిపై మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదు.
అయితే కొద్ది రోజులుగా పలువురు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి బాలయ్య తదుపరి సినిమా డైరెక్టర్స్ లిస్టులో గోపీచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ వంటి వారు ఉన్నారని ఇప్పటికే ఆయా దర్శకులు బాలయ్యకు కథలు వినిపించి సినిమాలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అలానే బాలయ్య కూడా వారితో వరుసగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే వీరిలో ఎవరి సినిమాని బాలయ్య ముందుగా చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందని మరి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో అలానే తదుపరి సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు......!!