దగ్గుబాటి రానా సినీ జీవితం బాహుబలి సినిమా నుండి మంచి ఊపందుకుందని చెప్పొచ్చు. కథలను ఎన్నుకునే విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్నాడు రానా. బాహుబలి ఇచ్చిన సక్సెస్ వలన  ప్రస్తుతం తనకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటిని ఒక్కొక్క సినిమాను పూర్తి చేసుకుంటూ విడుదలకు సిద్ధం చేసుకుంటున్నాడు.

వాస్తవానికి  "అరణ్య"  సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా, ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతబడడంతో ఈ సినిమాని ఓ టి టి లో విడుదల చేయడానికి ఈ సినిమా బృందం సాహసం చేయలేకపోయింది. ఇప్పుడు మనదేశంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో మళ్ళీ సినిమాల విడుదల జోరు ప్రారంభం అయింది. దాంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్  ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఇటు సినిమాలతోనూ, భారీ యాడ్స్ లలోనూ, అప్పుడప్పుడు టీవీ షోల లోనూ... ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే రానా ఇప్పుడు తాజాగా డాక్యుమెంటరీ  తో మన ముందుకు రానున్నట్లు సమాచారం. సరిహద్దు దళాల పనితీరు పై, వారి జీవన శైలి పై డిస్కవరీ ప్లస్ ఛానెల్ తో కలిసి `మిషన్ ఫ్రంట్ లైన్` అనే డాక్యుమెంటరీ  చేశాడట రానా దగ్గుబాటి. ఈ డాక్యుమెంటరీ డిస్కవరీ ప్లస్ ఛానల్ లో ఈ జనవరి 21న ప్రసారం కానుందని తెలిపారు. ఇది తన కెరియర్ లో మరో బెస్ట్ అవుతుందని భావిస్తున్నారట రానా. అటు విరాటపర్వం సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు ఫైనల్ దశకు చేరుకుంది. ఈ 2021 రానాకు మరిన్ని విజయాలు రావాలని  అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: