మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఒకే డ్రెస్ ను రెండు సంవత్సరాలు వేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..!అవును నిజమండీ.. మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా కోసం ఒకే డ్రెస్ ను ఏకంగా రెండు సంవత్సరాలు వేసుకున్నాడట. అయితే అది ఏ సినిమా? ఎందుకు ఒకే డ్రెస్ ను రెండు సంవత్సరాలు వేసుకోవలసి వచ్చింది? గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం "అంజి". ఈ సినిమా 2004 వ సంవత్సరం లో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అని అనిపించుకుంది. అప్పట్లో హాలీవుడ్ రేంజ్ ను తలపించేలా అంజి సినిమా తెరకెక్కడం గమనార్హం.
హాలీవుడ్ సినిమాలలో ఉండే గ్రాఫిక్స్ మొత్తం అంజి సినిమాలో చూపించడానికి ఏకంగా ఐదు సంవత్సరాల పాటు చిత్రం యూనిట్ కష్టపడి అంజి సినిమాను రూపుదిద్దారు. ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజులపాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఒక సందర్భంలో చెప్పాడు. అయితే ఈ సినిమా అంత భారీగా రూపుదిద్దుకోవడానికి గల కారణం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అని చెప్పవచ్చు.
ఈ సినిమాకు పెద్దయ్య పాత్రలో నాగబాబుని ఎంచుకున్నారు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షార్ట్స్ తీయాల్సి వచ్చేదట. వాళ్ళు అలా తీయబట్టే ఆ సినిమాకు ఐదు సంవత్సరాలు పట్టింది. ఇక శ్యాం ప్రసాద్ రెడ్డి చాలా ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. ఇక ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ కోసం సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాలలో చేశారు. గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్ కు మార్కులు పెట్టేవారట. ఆయన రోజూ అదే డ్రెస్ వేసుకునేవారట . కనీసం ఉతకడానికి కూడా సమయం లేక రెండేళ్ల పాటు అదే కాస్ట్యూమ్స్ కొనసాగించడం జరిగింది. కేవలం గ్రాఫిక్స్ కోసమే చిరంజీవి ఒకే డ్రెస్ ను రెండు సంవత్సరాలపాటు వేసుకోవాల్సి వచ్చిం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి