హైదరాబాద్ ఐపిఎల్ టీం కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. క్రికెట్ లవర్స్, సినీ లవర్స్ ఇద్దరు వేరు కాదు.. అయితే గ్రౌండ్ లో క్రికెట్ అభిమానులను.. బయట సినీ లవర్స్ ను ఇద్దరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. బుట్ట బొమ్మ, మహర్షి సినిమాలోని పాటలను, సీన్స్ ను రీ ఫేస్ తో తన మార్క్ చూపించాలని ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ కొత్తగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్ ను కూడా వదల్లేదు.
డేవిడ్ వార్నర్ వర్షన్ ఆచార్య టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆచార్య లో చిరు చెప్పిన డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ రీ ఫేస్ యాప్ తో హంగామా చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఓ విధంగా చెప్పాలంటే క్రికెట్ తో సంపాదించే క్రేజ్ కంటే ఇలా తెలుగు సినిమాల మీద డేవిడ్ వార్నర్ చేస్తున్న వీడియోస్ తో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. మెగా ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యేలా డేవిడ్ వార్నర్ ఆచార్య టీజర్ అదుర్స్ అనేలా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి