టాలీవుడ్ సెన్సేషనల్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తను చేస్తున్న సర్కారు వారి పాట
సినిమా పై పూర్తి దృష్టి పెట్టారు
. ఇక ఈ మూవీలో
మహేష్ బాబు ఆర్థిక నేరస్థుడు గా కనిపించ
నుండగా ఆ పాత్ర కోసం ఆయన పూర్తిగా
లాంగ్ హెయిర్ ని పెంచడంతోపాటు
తన మేకోవర్ ని కూడా పూర్తిగా మార్చేశారు.
యువ దర్శకుడు పరుశురాం
పెట్ల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా
తెరకెక్కుతున్న ఈ సినిమాలో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 1
4 రీల్స్ ప్లస్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్
, మైత్రి
మూవీ మేకర్స్ సంస్థ లు దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి
. మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరుశురాం ఈ
సినిమా కథని ఎంతో అద్భుతంగా రాసుకున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ
మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది
. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ
మూవీ యొక్క తొలి షెడ్యూల్ ఇటీవల
దుబాయ్ లో ప్రారంభమై నిన్నటితో ముగిసింది
. అందుతున్న సమాచా
రాన్ని బట్టి దీ
ని ఒక రెండో షెడ్యూల్ ని గోవాలో ఫిక్స్ చేసినట్లు సమాచారం
.
రేపు
మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి
ఇండియా చేరుకొని ఆపై
గోవా వెళ్తారని
, మార్చి మొదటి వారం నుంచి అక్కడ రెండో షెడ్యూల్ ప్రారంభమై ఏప్రిల్ మొదటి వారం వరకు కొనసాగుతుందని అంటున్నారు
. హీరో హీరోయిన్ సహా పలువురు
ముఖ్య నటులు
ఈ షెడ్యూల్లో పాల్గొన్నారని అలానే కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా అక్కడ తీయనున్నారు అని చెప్తున్నారు
. కాగా ఈ
సినిమా వచ్చే ఏడాది
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే
. మరి ఈ
సినిమా మహేష్ కి ఎంతవరకు
సక్సెస్ ని అందిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే....!!