తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఎంత పేరు ఉందొ అందరికి తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ చిన్నపుడు మనం ఎక్కువగా ఆయన కొడుకు ఆకాష్ పూరి ని చూస్తాం. అయితే ఆకాష్ పూరి హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాగా ఆంధ్ర పోరి లో నటించాడు. కాకపోతే ఈ సినిమా అంత గొప్పగా ఆడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాలో కూడా హీరోగా నటించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత కూడా పూరి నిర్మాతగా రొమాంటిక్ అనే సినిమా షూట్ చేశారు. ఈ సినిమా నుంచి ఒక పాట కూడా విడుదలైంది. అయితే సినిమా మాత్రం ఇప్పటికి రిలీస్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మోక్షం వచ్చింది. ఈ సినిమాని జూన్ లో విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది. ఈ సినిమాకి కథ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించారు. ఇక ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్ పూడిరి డైరెక్ట్ చేస్తున్నారు.  చాలా మంది ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది అనుకున్నారు కానీ ఈ సినిమా ఇప్పుడు విడుదల అవుతుండటంతో ఆకాష్ పూరి ఈ సినిమాతో అన్న సూపర్ హిట్ కొడతారో లేదో చూడాలి. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి అని టాక్. పోస్టర్స్ , పాటలు చూస్తుంటేనే ఈ సినిమా నిజంగానే థియేటర్స్ లో హీట్ పెంచేలా ఉన్నాయి.  అయితే ఆకాష్ పూరి తన కొత్త సినిమా పూజ ఈ మద్యనే జరిగింది.  ఈ సినిమా జార్జి రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక పూరి మాత్రం ఒక పక్క విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: