ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ముందు స్థానంలో నిలుస్తుంది.. ఇటీవలే అల్లు అర్జున్ సరసన ఈమె నటించిన అల వైకుంఠ పురములో సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఆకాశాన్ని అంటింది.. అగ్ర హీరోలందరూ ఈ అమ్మడి వైపే మొగ్గుచూపుతున్నారు.. దీంతో ఈ బుట్టబొమ్మ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.. అంతేకాదు ఒక్కో సినిమాకు రెండు నుంచే నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్ కూడా పూజానే..

ఇక ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటిస్తోంది..ఇక పూజా హెగ్డే ఫ్యామిలీబ్యాక్ గ్రౌండ్ గురించి లోతుగా పరిశీలిస్తే... అక్టోబరు 13, 1990న ముంబై లో జన్మించింది పూజ.. తల్లి లతా హెగ్డే, తండ్రిమంజునాథ్ హెగ్డే.. ఇక ముంబైలో జన్మించిన పూజా  తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటకలోని లోని మంగుళూరు..ఈమె మాతృభాష తులు.. దానితో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది పూజ..ఇక ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత విద్య చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొంది..

అలా సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది...అంతేకాదు 2009 మిస్ ఇండియా పోటీలలో  పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే  2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది..ఇక పూజ ఇష్టపడే ఫుడ్ బిర్యానీ, పిజ్జా..ఇక ఇష్టమైన సెలెబ్రిటీస్ విషయానికొస్తే.. క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది...ఇక తన ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: