ఈ నెలలో శివరాత్రి సందర్బంగా విడుదల అయిన ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ తో పోటీపడే విషయంలో ‘గాలి సంపత్’ కు మూడవ స్థానం మాత్రమే లభించింది. ‘జాతి రత్నాలు’ సూపర్ హిట్ కాగ ‘శ్రీకారం’ మోస్తరు విజయాన్ని అందుకుంటే ఘోర పరాజయాన్ని ‘గాలిసంపత్’ ఎదుర్కొన వలసి వచ్చింది. రాజేంద్రప్రసాద్ శ్రీవిష్ణులు తమ అద్భుతమైన నటనతో తమ పాత్రలకు జీవం పోసినా ఈ సినిమా ప్రమోషన్ లో అనిల్ రావిపూడి అన్ని తానై ముందుండి నడిపించినా ఈ మూవీకి ఫెయిల్యూర్ టాక్ రావడం అనీల్ రావిపూడికి షాక్ ఇచ్చింది.
ఇప్పటి వరకు పరాజయం ఎరుగని అనీల్ రావిపూడి మొదటిసారి తన కెరియర్ లో ఫెయిల్యూర్ ను ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ సినిమాకు మొదటిరోజు మొదటి షో నుండి ఘోరమైన ఫెయిల్యూర్ టాక్ రావడంతో విడుదలైన ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ పడిపోయాయి. ఇక రెండో రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో చాలా థియేటర్లలో ‘గాలి సంపత్’ షోలను కూడా రద్దు చేసారు.
అయితే ‘గాలిసంపత్’ డిజిటల్ హక్కులను ఆహా ఓటిటి దక్కించుకోవడంతో మార్చి 19న డిజిటల్ రిలీజ్ గా ఆహలో స్ట్రీమ్ అయింది. అయితే అనూహ్యంగా ఆహాలో ‘గాలిసంపత్’ సినిమాకు మంచి ఆదరణ ప్రేకషకుల నుండి లభించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీనితో ఈ మూవీని పోటీ లేకుండా సింగిల్ గా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా అన్న నిరాశలో అనీల్ రావిపూడి ఉన్నట్లు టాక్. ఏది ఏమైనా అనిల్ రావిపూడి కి ‘గాలి సంపంత్’ ఊహించని షాక్ ఇచ్చింది అనుకోవాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి