తమిళ నటీమణి నివేదా పేతురాజ్ ఎక్కువగా టాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నివేదా అనంతరం బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అలవైకుంఠపురంలో వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనా చాతుర్యాన్ని కనబరిచారు. ఆ సినిమాలు  ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మత్తెక్కించే హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకి మతులు పోగొడుతున్నారు. అయితే ఆమె స్కిన్ షో చేయడాన్ని బట్టి చూస్తుంటే బోల్డ్ రోల్స్ లో కూడా నటించడానికి ఆమెకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్ లో నటించే విషయం పై మాత్రం కొన్ని ఆంక్షలు పెట్టారు.


సినిమా వర్గాల సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ అనే ఓ సినిమాలో ముద్దు సీన్లలో నటించడానికి నివేదా పేతురాజ్ తీవ్ర అభ్యంతరం తెలిపారట. తాను రొమాంటిక్ సన్నివేశాల్లో అస్సలు నటించనని ఖరాఖండిగా చెప్పేశారట. విశ్వక్ సేన్ సినిమాలో కూడా ఆమె నో కిస్ పాలసీ పాటించారట. అయితే విశ్వక్ సేన్ తన ప్రతి సినిమాలో లిప్ కిస్ లు పెట్టారు. కానీ పాగల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నివేదా రొమాన్స్ కి ఒప్పుకోకపోవడంతో.. పాగల్ సినిమా అధర చుంబనాలు లేని మొట్టమొదటి విశ్వక్ సేన్ సినిమా అయిపోయింది.


నివేదా పేతురాజ్ విరాటపర్వం సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నారు. కార్తికేయ సినిమాకి దర్శకత్వం వహించిన చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న మరొక తెలుగు చిత్రంలో ఆమె నటిస్తున్నారు. పోన్ మాణికవేల్, పార్టీ అనే రెండు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. 2021 లో వచ్చిన రెడ్ సినిమాలో నివేదా పేతురాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆమె అత్యంత కీలకమైన పాత్ర పోషించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: