టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే... మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. తనకు నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చకపోయినా సినిమా తీస్తాడు. అతనే ఇండియన్ ‘హిచ్ కాక్’ రాంగోపాల్ వర్మ. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ  తెలుగు సినిమాకు రెండు కళ్ళ లాంటి వారైనా  ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తో ఉన్న ఫోటో ఎప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..



 టాలీవుడ్ లో  తెలుగు చిత్రానికి  రెండు కళ్ల లాంటి వారు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో రామ్ గోపాల్ వర్మ ఉన్న ఫోటో రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికొస్తే.. ఆయన సంచలనాలకు మారు పేరు. అయితే నిత్యం ఏదో  ఒక వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. అతడు మాట్లాడినా  సంచలనమే  మాట్లాడక పోయినా  సంచలనమే. మొత్తానికి వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. తనకు నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చకపోయినా సినిమా తీస్తాడు. అయితే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అందరు సినిమాలు లేక ఖాళీగా ఉంటే.. ఈయన మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.గతేడాది ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ ‘పవర్ స్టార్’ వంటి  సినిమాలను తనకు సంబంధించిన ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసాడు.



 ఇప్పుడు కరోనా వైరస్ అనే సినిమాతో పలు సినిమాలతో ఇప్పటికీ బిజీ బిజీగానే గడుపుతున్నాడు. బహుశా కరోనాకు ముందు ఆ తర్వా త కూడా చేతి నిండా సినిమాలతో  ఫుల్‌ బిజీగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే అతిశయోక్తి కాదు.ఆ సంగతి పక్కన పెడితే.. అప్పటి వరకు ఒక మూసలో పోతున్న తెలుగు చిత్రాన్ని తన ‘శివ’ సినిమాతో పూర్తిగా మార్చేసాడు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పాలంటే శివకు ముందు.. శివకు తర్వాత అనేంతలా తనదైన మార్క్ క్రియేట్ చేసిన జీనియస్ రామ్ గోపాల్ వర్మ. అలాంటి వర్మ.. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఉన్న కలిసి ఉన్న ఫోటో వర్మ పుట్టినరోజు సందర్భంగా సామాజిక్ మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.


ఈ ఫోటో  అప్పటి నంది అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా తీసినది. అప్పట్లో తొలి సినిమా శివతోనే రామ్ గోపాల్ వర్మ.. ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేతులు మీదుగా వర్మ ఈ అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ అవార్డు ప్రోగ్రామ్‌లో ఏఎన్నార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాను అక్కినేని నాగేశ్వరరావు చిన్నబ్బాయి నాగార్జున హీరోగా నటిస్తే.. పెద్దబ్బాయి.. అక్కినేని వెంకట్‌తోె పాటు ఎస్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్‌లో అక్కినేని పెద్దల్లుడు యార్లగడ్డ సురేంద్ర ఈ  చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.


ఈ సినిమాను అప్పట్లో నాగార్జున, అమల హీరో, హీరోయిన్లుగా అదే శివ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తే అక్కడా కూడా ఈ సినిమా హిట్టైయింది.స్వతహాగా రామ్ గోపాల్ వర్మ తాను ఎన్నోసార్లు ఎన్టీఆర్ అభిమానిగా చెప్పుకొన్నాడు. అంతేకాదు ఆయన నటించిన అడవి రాముడు సినిమాను ఎన్నోసార్లు చూసానో లెక్కేలేదు అంటూ చెప్పిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్ తర్వాత బాలయ్య అంటే తనకు ప్రత్యేక ప్రేమ ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అది నిజంగా చెప్పాడా లేకపోతే వ్యంగ్యంగా అన్నాడా అనేది పక్కన పెడితే   ఇక వర్మ తన అభిమాన నటుడి చేతి నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని చాలా ఇంటర్వ్యూలో  చెప్పారు. ఇక వర్మ.. ఎన్టీఆర్ తనయుడు బాలయ్య అన్నగారి  జీవితంలో తెరకెక్కించకుండా ఒదిలేసిన భాగాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: