తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మది కెమెరామెన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభం కాగా ప్రస్తుతం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇవాళ్టి నుంచి ఈ మూవీ షూటింగ్ ని నిలుపుదల చేసింది యూనిట్. అయితే ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి, మహేష్ సినిమా ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉండటంతో ఈలోపు మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని కమిట్ అయినట్లు ఇటీవల కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
అయితే మహేష్ మనసులో మరో ఆలోచన ఉందని రాజమౌళి సినిమా మొదలయ్యే లోపు కేవలం త్రివిక్రమ్ తో మాత్రమే కాకుండా దాని అనంతరం అనిల్ రావిపూడి తో కూడా మరో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట మహేష్ బాబు. అలానే ఈ రెండు సినిమాలపై త్వరలో అఫీషియల్ న్యూస్ బయటకు రానుందట. మరి ఈ వార్త కనుక నిజమైతే ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండుగ వార్తే అని చెప్పాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి