ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్లీ ఆందోళన కరంగా మారుతుంది. అయితే, గతంలో
కన్నా ఇప్పుడు ప్రభాలుతున్న వైరస్ వ్యాప్తి పది రెట్లు అధికంగా ఉంది. దాంతో
కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినూత్న ఆలోచనలకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పోలీసులు జనాలను కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. సినీ
పరిశ్రమ లోని కార్మికుల కోసం మెగా స్టార్
చిరంజీవి కొత్త ఆలోచన చేసి, వారిని ఆదుకోవడానికి క్రైసిస్ చారిటీని మొదలు పెట్టారు..
ఈ ఛారిటీ ద్వారా విరాళాలను సేకరించి కొంతవరకు సాయాన్ని అందించాడు. ఇప్పుడు మరోసారి సినీ కార్మికులకు, జర్నలిస్టులకు అదిరిపోయే
గుడ్ న్యూస్ చెప్పారు.45 ఏళ్లు పైబడిన వారందరికీ అపోలో సౌజన్యంతో కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా ఉచితంగా వ్యాక్సినేషన్‌ను అందించనున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా మూడు నెలల పాటు అపోలో ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చని వెల్లడించారు. మందుల్లో కూడా రాయితీలు లభించే వెసులుబాటును కల్పించనున్నట్టు వెల్లడించారు.
అంతే కాదు.. 45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినీ జర్నలిస్టుల భాగస్వాములకు సైతం 45 ఏళ్లు దాటితే వారికి కూడా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఓ వీడియో ద్వారా సోషల్
మీడియా లో ప్రకటించారు.45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు మీ అసోసియేషన్స్ లేదా యూనియన్స్‌లో మీ పేరు నమోదు చేసుకోండి. మీతో పాటు మీ
జీవిత భాగస్వామికి 45 ఏళ్లు దాటితే వారికి కూడా మీతో పాటు ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా ఉచితం. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు కొందరికీ అపోలో హాస్పిటల్లో తగిన వసతులతో వ్యాక్సినేషన్ ఇస్తారు.
అలాగే మూడు నెలల పాటు అపోలో ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చు. మందుల్లో కూడా రాయితీలు లభించే వెసులుబాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఉంటుంది. కరోనా నుంచి మన పరిశ్రమను మనం కాపాడుకుందాం. ప్లీజ్ దయచేసి ముందుకు రండి వ్యాక్సిన్ వేయించుకోండి. స్టే సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్'' అని చిరు ట్వీట్ లో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..