
నటి ప్రగతి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు .ఎందుకంటే ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వీడియోలతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అయితే ఈమె సినిమాలలో ఎంత పాపులారిటీ సంపాదించుకున్నా, సోషల్ మీడియాలో అంతకు మించి అనేలా ఫేమ్ ను కూడగట్టుకుంది. ఈ మధ్య కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ప్రతీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను దుమ్ముదులిపేస్తున్నాయి. ఇక తన అందచందాలతో హాట్ హాట్ గా చిందులేస్తూ , పలు వీడియోలతో రచ్చ చేస్తోంది ప్రగతి..
ఇక ఇప్పటికే పలుసార్లు తన డాన్స్ వీడియోలతో స్పెషల్ కిక్ ఇచ్చిన ఈమె, తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తూ రచ్చ చేసింది.. ఇప్పుడు ఇంకాస్తంత గ్లామర్ డోస్ యాడ్ చేసి , తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ, ఎంతో ఎనర్జీ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో ప్రగతి మాత్రమే కాకుండా ఈమె ఫ్రెండ్ కూడా తనతోపాటు చిందులేసింది." డ్రీముమ్ వేకుపమ్ "అనే తమిళ పాటకు ఇద్దరూ కలిసి ఇంట్లోనే రెచ్చిపోయి డాన్స్ చేశారు.. ఫాస్ట్ మూమెంట్స్ కి తోడు, ఇద్దరూ గ్లామర్ డోస్ పెంచడంతో ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం అయింది.
ప్రగతి 44 సంవత్సరాల వయసులో కూడా ఫిజికల్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి, ఈమె చేస్తున్న హంగామా చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.. ఇక అంతే కాకుండా ఈమెకు ఉన్న ఎనర్జీ, డాన్స్ నీ చూసిన వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. తీన్మార్ స్టెప్పులు వేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా,క్లాసికల్ డాన్స్ చేయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ , సోషల్ మీడియాలో దూసుకుపోతోంది ఈ సీనియర్ నటి..
వెండితెరపై ఎంతో పద్ధతిగా అమ్మ ,అక్క, వదిన, అత్త పాత్రల్లో కనిపించే ప్రగతి, సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఈ వయసులో కూడా ఇంత అందంగా ,ఇంత ఎనర్జిటిక్ గా ఉండడం చూసి నెటిజన్లు వావ్ అని అంటున్నారు..https://www.instagram.com/reel/COP2UEijQ92/?igshid=1r8fbpffrawzl