అడవి శేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందరి లాగే తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చినా ఎవ్వరూ ఊహించలేనంతగా ఎదిగిపోయాడని చెప్పాలి. ఈ నటుడు తొలి సినిమాతోనే తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పంజాలో చేసిన పాత్రతో మరింత గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇవన్నీ అటుంచితే రాజమౌళి బాహుబలి లో అవకాశమే ఇతని జీవితంలో దక్కిన అదృష్టమని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ సినిమాలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తరువాత తాను చేసే సినిమాలలో కొత్త కొత్త కోణాలలో నటన ఉండేలా ప్రణాళిక చేసుకున్నాడు.  క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలలో నటనే కాకుండా కథను అందించడంలోనూ ప్రత్యేక శ్రద్ద చూపించాడు.

ఇలా తెలుగు సినీ పరిశ్రమలో అడవి శేష్ సినిమా అంటే ఒక ల్యాండ్ మార్క్ ఉండేలా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే ఎప్పుడైనా అడవి శేష్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షుకుల్లో ఒక అటెన్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు సరికొత్తగా ప్రిన్స్ మహేష్ బాబు నిర్మాణ సంస్థలో మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మేజర్ ఉన్ని కృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అడవి శేష్ తాతకు సంబంధించిన వార్తను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీనితో ఈ వార్త అందరికీ ఆసక్తిగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే అడవి శేష్ తాతగారు ఒక స్వాతంత్ర్య సమరయోధుడని తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ఒక లెటర్ ను ఇంస్టాగ్రామ్ ద్వారా అడవి శేష్ పోస్ట్ చేశారు. ఈ లెటర్ పూర్వ కాలంలో తన తాత అడవి గంగరాజు (సన్నాఫ్ భోగరాజు) గారికి తామ్రపత్ర పురస్కారం దక్కినట్లు ఇందులో ఉంది. దీనిని ధ్రువీకరిస్తూ ఒక లెటర్ ను అప్పటి పశ్చిమ గోదావరి కలెక్టర్ పంపినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని అడవి శేష్ తన అభిమానులందరికీ తెలియచేశారు. దీనితో నెటిజన్లు అడవి శేష్ ఇంట్లో కూడా భారతీయుడు సేనాపతి ఉన్నారు అని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: