టాప్ యంగ్ హీరోల డేట్స్ కోసం సంవత్సరాలు తరబడి దర్శకులు వేచి చూడవలసిన పరిస్థితి. గతంలో దాసరినారాయణరావు లాంటి ప్రముఖ దర్శకులు టాప్ హీరోల దక్కరకు వెళ్ళి తాను తీయబోతున్న కథ లైన్ మాత్రమే చెప్పి వారి డేట్స్ ఫిక్స్ చేసుకునే వారట. అదేవిధంగా దర్శకులు విశ్వనాథ్ రాఘవేంద్రరావు బాపు ల హవా నడిచేది.


ఇప్పటి తరం దర్శకులలో ఒక్క రాజమౌళి తప్ప మరి ఏటాప్ దర్శకుడు అయినప్పటికీ టాప్ హీరోల కరుణా కటాక్ష వీక్షణా లపై ఆధారపడవలసిన పరిస్థితి. మొదట్లో ఒక టాప్ దర్శకుడు చెప్పిన కథకు ఓకె చెప్పిన టాప్ హీరో చివరకు ఆ కథ స్క్రిప్ట్ రూపంగా మారిన తరువాత ఆకథ తనకు నచ్చలేదు అని చెప్పిన సంఘటనలు ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి.


‘రంగస్థలం’ మూవీ తరువాత సుకుమార్ మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తే మొదట్లో ఓకె చెప్పి ఆతరువాత కొంతకాలానికి మహేష్ సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చినప్పుడు అతడిని బన్నీ ఆదుకుని రక్షించాడు. అదేవిధంగా ‘మహర్షి’ మూవీ తరువాత వంశీ పైడిపల్లి తో మరొక మూవీ చేస్తానని మాట ఇచ్చి మహేష్ అనీల్ రావిపూడి వైపు వెళ్ళిపోవడంతో వంశీ పైడిపల్లికి బ్యాడ్ లక్ ఎదురైంది అనుకున్నారు.


అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లికి తమిళ సూపర్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇలా మహేష్ తిరస్కరణ పొందిన దర్శకులు కొంత ఆలస్యం అయినప్పటికీ మరొక టాప్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ పరిస్థితులు అన్నీ గమనించినవారు మహేష్ తిరస్కరణలో కూడ అదృష్టం ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ చాలామంది యంగ్ డైరెక్టర్స్ దృష్టి వరకు వెళ్ళడంతో మహేష్ కు కథ చెప్పి ఒకవేళ తిరష్కరణ పొందినా ఎదో ఒక రోజున మరొక టాప్ హీరో నుండి పిలుపు వస్తుంది అన్న ఆశలతో ఉన్నట్లు కనిపిస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: