యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి కలసి ఒక యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ, మనసుని హత్తుకునే రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.


కాగా, ప్రస్తుతానికి రామ్ పోతినేని 19వ సినిమాకి "రాపో19" అనే పేరు పెట్టారు. ఏ టైటిల్ ని ఫైనలైజ్ చేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఐతే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. రామ్ హీరోగా నటించిన జగడం, రెడీ, శివం, ఉన్నది ఒకటే జిందగీ, నేను, శైలజ, హలో గురు ప్రేమకోసమే వంటి 6 సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దీంతో దేవిశ్రీ - రామ్ కాంబో ఏడవసారి రిపీట్ కాబోతోందని చెప్పుకోవచ్చు.



అయితే ఈ రోజు రామ్ పోతినేని తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ నెక్స్ట్ సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు చాలా ఆశతో ఎదురు చూశారు కానీ వారిని చిత్రబృందం నిరాశపరిచింది. "రాపో చిత్ర బృందం తరపున మా ఉస్తాద్ రామ్ పోతినేని కి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను మేము అర్థం చేసుకున్నాము. అందుకే మన హీరో పుట్టినరోజు సందర్భంగా (ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా) సింపుల్ గా పరిస్థితులను ఉంచుతున్నాం. ఈ గడ్డు సమయాల్లో, మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. మనం ఐక్యమత్యంగా పోరాటం చేసి కరోనాను అధిగమించవచ్చు" అని సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.



ఐతే ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని దర్శకుడు లింగుస్వామి వెల్లడించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాని 2022 లో విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ ఓ కీలక పాత్ర పోషించానున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: