డర్టీ పిక్చర్, కహానీ, శకుంతలాదేవి వంటి చిత్రాల్లో నటించి బాలీవుడ్ పరిశ్రమలో మంచి నటీమణి గా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్ నంది అవార్డు కూడా అందుకున్నారు. 2014లో ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. 2012వ సంవత్సరంలో తాను సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో డేటింగ్ చేస్తున్నానని విద్యాబాలన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పటికే సిద్ధార్థ్ ఆర్తి బజాజ్, కవిత అనే ఇద్దరినీ పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. డిసెంబర్ 14, 2012 లో విద్యాబాలన్ సిద్ధార్థ్ ని మూడవ పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఒక బడా వ్యాపారవేత్త, సినిమా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన వాల్ట్ డిస్నీ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఆయన కౌన్‌ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షో లాంచింగ్ మార్కెటింగ్ వర్క్ కూడా చేశారు. 2003వ సంవత్సరంలో స్టార్ టీవీ గ్రూప్ కి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇండియాతో పాటు పలు దేశాల్లో స్టార్ నెట్వర్క్ పాపులారిటీ పెంచడంలో సిద్ధార్థ్ కపూర్ చాలా కృషి చేశారు.


2005వ సంవత్సరంలో యూటీవీ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్.. హంగామా టీవీ ఛానల్ ని ఓ గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. 2008లో యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యారు. ఆయన నాయకత్వంలో యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చిన ఎన్నో బాలీవుడ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. 2017 సంవత్సరంలో డిస్నీ సంస్థ నుంచి వైదొలిగిన సిద్ధార్థ్ సొంతంగా రాయ్ కపూర్ ఫిలింస్ నిర్మాణ సంస్థను స్థాపించారు. ప్రియాంక చోప్రా నటించిన ది స్కై ఈజ్ పింక్ సినిమాని ఆయన తన సొంత బ్యానర్ పై నిర్మించారు. ఉత్తమ వ్యాపారవేత్తగా ఆయనకు ఎన్నో అవార్డులు లభించాయి. అయితే ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించక ముందు చాలా సినిమాలు కోప్రొడ్యూస్ చేశారు. ఆయన సంవత్సరానికి రూ.30 కోట్లకు పైగా సంపాదిస్తారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.


ఇకపోతే విద్యాబాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ తన వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. సిద్ధార్థ్ సోదరుడు ఆదిత్య రాయ్ కపూర్ ఆషీకీ 2 సినిమా తో భారత దేశ వ్యాప్తంగా ఎనలేని పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే తన తమ్ముడు నటించిన చాలా సినిమాలకు సిద్ధార్థ్ రాయ్ కపూర్ సహా నిర్మాతగా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: