
అయితే సినిమాల పరంగా తప్పా ఏవిధంగానూ వార్తల్లో నిలవని ఉపేంద్ర సడెన్ గా "నాకు సీఎం అవ్వాలని ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా" అంటూ ప్రజలకు లేఖ రాశారు. తాను రాజకీయాలకు వస్తే నిరంతరం ప్రజాసేవలోనే ఉంటానని సీఎం (కామన్ మ్యాన్) అన్న పదానికి సరైన అర్థం తెలియజేస్తానని అయన తెలిపారు. తాను సీఎం అయితే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసాకి తానే జవాబుదారినని వెల్లడించారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయంగా ఉంటానని లేఖ లో పేర్కొన్నారు. ఈవిధమైన లేఖ తో ఉపేంద్ర ఒక్కసారిగా కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపినట్లు అయ్యింది.
అయన సినిమాల విషయానికొస్తే తెలుగులో కొన్ని సినిమాలు చేసి టాలీవుడ్ పేక్షకులకు ఎంతో సుపరిచయమైన ఉపేంద్ర తెలుగులో కన్యాదానం, రా, పిచ్చోడు, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయనకు ఇక్కడ స్టార్ హీరో కి ఉన్న మార్కెట్ ఉంది అంటే తెలుగు వారికి అయన ఎంత స్పెషల్ అనేది చెప్పొచ్చు. ప్రస్తుతం అయన వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా లో హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారట. అంతేకాకుండా కన్నడ లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా అయన నటిస్తున్నారు..