"ఏక్ మినీ కథ సినిమా ప్రత్యేకమైన & నిష్కళంకమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. మూవీ టీమ్ కి నా బెస్ట్ విషెస్! మే 27 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ఏక్ మినీ కథ చూడండి," అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అయితే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది కాబట్టి రామ్ చరణ్ ప్రమోషన్స్ చేయడానికి ఆసక్తి చూపారని తెలుస్తోంది.
ఇకపోతే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడానికి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సంస్థ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను విడుదల చేస్తోంది. ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ లో "అంగము ఎన్‌లార్జ్‌మెంట్ కోసం శస్త్రచికిత్స చేయించుకోవాలి అనుకుంటున్నాడు" అని ఒక కమెడియన్ ఆస్పత్రిలో గట్టిగా అరవడం కూడా చూడొచ్చు. దీన్నిబట్టి హీరో తన అంగం గురించి బాగా బాధ పడతారు అని తెలుస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శ్రద్దాదాస్ పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నేరుగా ఓటీటీ వేదికలో విడుదల అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి