స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఆయన కథానాయకుడిగా నటించిన ఐదు సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుని వలే హీరోగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆయన హీరోగా ఆరవ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా "శిరీష్-6" అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రం కోసం అల్లు శిరీష్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఈ "గౌరవం" హీరో వ్యాయామశాలలో కసరత్తులు చేస్తూ తన తదుపరి చిత్రంలోని పాత్రకు న్యాయం చేసేందుకు పూర్తి అంకితభావంతో కష్టపడుతున్నారు.


అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీ కి సంబంధించిన ఫోటోలు ఇటీవల నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులు ఇంకా అల్లు శిరీష్ బాడీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే "శిరీష్-6" సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల అయింది. కాగా ఈ పోస్టర్ లో శిరీష్ ఒక యువతిని ముద్దు పెట్టుకున్నట్టు కనిపించింది. ఈ పోస్టర్ లో మొహాలు కనిపించని ఇద్దరు గాఢమైన రొమాన్స్ చేస్తున్నట్టు కనిపించింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా మజ్ను ఫేమ్ అనూ ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నారు. దీంతో ఈ పోస్టర్ లో అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ లిప్‌‌కిస్ చేసుకుంటూ రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే జీఏ 2 పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



అయితే ప్రీ లుక్ చాలా రొమాంటిక్ గా ఉండటంతో అల్లు అభిమానులు.. ప్రీ లుక్కే ఈ స్థాయిలో పిచ్చెక్కిస్తుందంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని కామెంట్ చేస్తున్నారు. అల్లు శిరీష్ మే 30 వ తేదీన అనగా ఆదివారం రోజు తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. కాగా అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: