చలనచిత్ర రంగంలో అనేక గమ్మత్తులు జరుగుతుంటాయి. ఒక సినిమా భారీ హిట్ అయిందంటే.. అలాంటి సినిమా తీయడానికే చాలామంది దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా సిద్ధమవుతారు. ఎందుకంటే అదే బాటలో నడిస్తే తమను కూడా విజయం వరిస్తుందని.. ప్రేక్షకులు అలాంటి సినిమాలే ఇష్టపడతారని  భావిస్తుంటారు. కానీ 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు' అనే నానుడి చాలా హీరోల విషయాల్లో నిజమయింది. ఉదాహరణకి సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు తర్వాత అలాంటి నేపథ్యంతోనే చాలా సినిమాలు వచ్చాయి కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కొందరు దర్శకులు, హీరోలు.. హిట్టయిన సినిమా టైటిల్స్ ని కూడా సెంటిమెంట్ తో వాడేస్తుంటారు. కానీ హిట్ టైటిల్స్ తో రికార్డులు సృష్టించిన వారిలో కొందరే ఉంటారు. అయితే రెడ్డి అనే సినిమా టైటిల్స్ తో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెక్కుచెదరని రికార్డు నెలకొల్పినవారిలో ఇద్దరే ఉన్నారు. ఆ హీరోలు మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ.


టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా టైటిల్ విషయంలో రెడ్డి అనే ఒక ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, భరత సింహారెడ్డి, రెడ్డిగారు పోయారు, అర్జున్ రెడ్డి, శైలజ రెడ్డి అల్లుడు, సైరా నరసింహారెడ్డి, జార్జి రెడ్డి, కడప రెడ్డమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల శీర్షికలు రెడ్డి అనే పదం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రెడ్డి టైటిల్ సినిమాలలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ, బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డులను సృష్టించారు.



బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆయన హీరోగా చేసిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా టాలీవుడ్ పరిశ్రమలో దుమ్ము రేపింది. ఇక ఆ తర్వాత రెడ్డి అనే పేరుతో వచ్చిన సినిమాలన్నీ బాలకృష్ణ సినిమాల స్థాయిలో హిట్స్ కాలేదనే చెప్పుకోవాలి. అయితే 2017లో రెడ్డి పేరుతో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం సంచలన రికార్డులను నమోదు చేసింది. దీంతో రెడ్డి అనే సినిమా టైటిల్స్ తో అరుదైన రికార్డులను నెలకొల్పడం బాలకృష్ణ, విజయ్ దేవరకొండ లకు మాత్రమే సాధ్యం అయిందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: