కౌశల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. ఉన్నటుండి ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు కౌశల్. గత సంవత్సరం 'స్టార్ మా' చానెల్‌లో ప్రసారమైన బిగ్‌బాస్ సీజన్-2 ద్వారా కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టార్ లాగా మారిపోయాడు.ఎంతో చాకచక్యంతో ఆటను ఆడాడు.హౌస్ మేట్స్ ఎన్ని కష్టాలు పెట్టిన, అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడు. అలాగే హౌస్‌లోని హౌస్ మేట్స్ అందరు ఒకటి అయ్యి కౌశల్ ని టార్గెట్ చేయడంతో చాలా మంది కౌశల్‌కు మద్దతుగా నిలిచారు.అలా కౌశల్ కి ప్రజల దగ్గర నుండి భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కొందరు కౌశల్ ఆర్మీలా తయారై అతడిని ఫైనల్ విన్నర్‌ను చేశారు.దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కౌశల్ పేరు ఫేమస్ అయిపొయింది. అయితే తాజాగా కౌశల్ తన భార్య గురించి చేసిన పోస్టు అందరిని కలవర పెడుతుంది. అసలు విషయంలోకి వెళితే…
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా కౌశల్ ఎంతో పాపులర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులన్నీ కూడా వృథా చేస్తున్నారు అంటూ కౌశల్ మీద ఆరోపణలు కూడా వచ్చాయి. ఇచ్చిన మాట ప్రకారం కౌశల్ తన డబ్బులను ఫౌండేషన్‌కు బదిలీ చేయలేదని కూడా ఒక టాక్ వచ్చింది. ఒక్క కౌశల్ మాత్రమే కాకుండా ఆయన భార్య నీలిమపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కౌశల్ ఆర్మీ వెనకాల నీలిమ ఉన్నట్లు రూమర్లు కూడా వచ్చాయి. అయితే ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నీలిమ ఆరోగ్యం గురించి కౌశల్ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తన భార్యకు ఆరోగ్యం బాగా లేదని మీడియా ముందే చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనితో కౌశల్ మీద అభిమానులకు ఒకింత సానుభూతి ఏర్పడింది.
కౌశల్ భార్య నీలిమకు ఇది వరకే ఓ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.తాజాగా కౌశల్ తన భార్య గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు కౌశల్ అభిమానులందరిని కదిలిస్తోంది.కౌశల్ తన భార్యని ఉద్దేశించి ఇలా పోస్ట్ చేసాడు" ఏదో సాధించేందుకు బయల్దేరావు,ఏదో ఒక పని చేసేందుకు నువ్వు నీ జీవితంతో పోరాడుతున్నావ్. నీకు ఉన్న ధైర్యంతో అది నువ్వు తప్పకుండా సాధిస్తావ్ అని నాకు తెలుసు నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను,నువ్వు కన్న నీ కలల కోసం పోరాడి మళ్ళీ తిరిగిరా ఐ లవ్యూ, మిస్ యూ "అంటూ కౌశల్ తన భార్య నీలిమను ఉద్దేశించి ఆ పోస్ట్ లో పేర్కోన్నారు. ఈ పోస్ట్ చూసి కౌశల్ అభిమానులు కంగారు పడుతూ,అన్నా వదినకు ఏమైంది,సమస్య ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.కౌశల్ పెట్టిన ఈ పోస్ట్ తో అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి