ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. కెరీర్ మొదలు పెట్టిన అనతికాలంలోనే టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఎప్పటికప్పుడు నటనలో కథల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరిత పాత్రలలో ప్రేక్షకులను అలరించి అభిమానుల సంఖ్యను పెంచుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేక కాస్త డీలా పడ్డాడు. దాంతో తదుపరి ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు శర్వానంద్. ప్రస్తుతం ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న "మహా సముద్రం" చిత్రంతో బిజీగా ఉన్న ఈ హీరో. ఈ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ఇది ఇలా ఉంటే శర్వానంద్ కొత్త మూవీ గురించి ఒక రూమర్ వినబడుతోంది. టాలీవుడ్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవర్ ఫుల్ స్టోరీ ని రెడీ చేసిన అనిల్ రావిపూడి ఆ స్టోరీ కి శర్వానంద్ అయితే సరిగ్గా సరిపోతాడని అనుకుంటున్నారట. స్ట్రాంగ్ కంటెంట్ అందులోనూ స్టార్ డైరెక్టర్ కావడంతో శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ ఒక విమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఉండనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక సమాజంలో జరిగే అంశాన్ని తీసుకుని కథను రెడీ చేసినట్లు సమాచారం. ఇందులో హీరో చెల్లెలు విమెన్ ట్రాఫికింగ్ మాఫియా చేతిలో బలవుతుంది.

ఈ సంఘటనతో హీరో మాఫియాను అంతమొందించే పనిలో పడతాడు. మొదటి అర్ధభాగం అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన కామెడీ ఉండనుంది. సెకండ్ హాఫ్ లో చేజింగ్ స్పీన్స్ ఉండబోతాయని తెలుస్తోంది. ఈ కథ చూస్తుంటే శర్వానంద్ కి హిట్ పక్కా అని తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటి వరకు అనిల్ప రావిపూడికి పరాజయం లేదు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా అటు శర్వానంద్ కానీ, అనిల్ రావిపూడి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: