టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్ర పరిశ్రమలో తండ్రి అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విభిన్న పాత్రలను పోషించి హీరోగా తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు నాగ్.ముఖ్యంగా నాగార్జునకి తన కెరీర్లో మొదటి బ్రేక్ ఇచ్చిన సినిమా శివ.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ ని సెట్ చేసింది. ఇక ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు నాగ్.ఇక హీరోగా దూసుకుపోతున్న సమయంలో తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ హీరో..రామానాయుడు గారి కూతురు లక్ష్మీ ని 1984లో వివాహం చేసుకున్నాడు.

దాదాపు ఆరేళ్ళ వీరి వివాహ బంధం తర్వాత 1990 లో పలు కారణాల వల్ల విడిపోయారు. వీరిద్దరి సంతానమే మన అక్కినేని హీరో నాగచైతన్య.ఇక ఆ తర్వాత తనతో కలిసి నాలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు నాగ్.మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన అమల..1992లో నాగార్జునని వివాహం చేసుకున్నారు.ఇక పెళ్లి తర్వాత అమల సినిమాల్లో నటించడం మానేసింది. ఇక ఇదిలా ఉంటె వీరి ప్రేమ వ్యవహారం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.షూటింగ్ సెట్స్ లో నాగార్జున, అమల ఇద్దరు సన్నిహితంగా ఉండేవారట.

ఇందులో భాగంగా ఓ సినిమా షూటింగ్ లో దర్శకుడు చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అమలను గమనించిన నాగ్.. డైరెక్టర్ కి చెప్పి ఆ కాస్ట్యూమ్స్ ని మార్పించచాడట.ఆమెను ప్రేమిస్తున్న సమయంలో అమల కోసం అమెరికా కూడా వెళ్లారట.ఇక అక్కడే ఓ సినిమా షూటింగ్ లో తన ప్రేమ విషయాన్ని అమలతో చెప్పగా.. నాగార్జున అంటే ఇష్టమున్న అమల కూడా వెంటనే ఒక్కుకుందట.ఇక వీరిద్దరి వివాహం చెన్నై లో కేవలం వారి కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇక వీరిద్దరి సంతానంగా అఖిల్ జన్మించాడు.ఇక ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. తాజాగా ఆయన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: