బాహుబలి సినిమాల తర్వాత
ప్రభాస్ తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నెక్స్ట్
సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఫాంటసీ
జోనర్ లో వచ్చిన పాతాళ భైరవి
సినిమా ఎలా హిట్ అయిందో.. ఇప్పట్లో ఫాంటసీ
జోనర్ లో వచ్చిన
బాహుబలి సినిమా అంతకుమించి హిట్ అయ్యింది.
బాహుబలి చిత్రాన్ని ఒక అద్భుతమైన హిస్టారిక్ డ్రామా అని కూడా పిలవచ్చు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొద్ది సంవత్సరాలుగా వీరగాథాలు, పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఫిలిమ్స్ వస్తున్నాయి కానీ అంతకు ముందు వరకు ఎవరూ కూడా ఈ జానర్స్ ని టచ్ చేయలేదు. కొన్ని సినిమాలు ఫాంటసీ
జోనర్ లో వచ్చాయి కానీ వాటిలో చాలా వరకు డిజాస్టర్స్ అయ్యాయి. కానీ
బాహుబలి హిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక చారిత్రక
సినిమా లేదా ఫాంటసీ చిత్రం చేయడానికి రెడీ అయిపోతున్నారు.
ప్రభాస్ "బాహుబలి" తర్వాత పిరియాడికల్ డ్రామా చిత్రాల సంఖ్య కూడా ఎక్కువైపోయింది. రీసెంట్ గా వీరగాథాలు, పురాణాలు, ఇతిహాసాలు రూపొందుతున్నాయి. కాగా ప్రస్తుతం
ప్రభాస్ ఒక పౌరాణిక చిత్రం లో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న "ఆదిపురుష్" సినిమాలో
ప్రభాస్ రాముడి పాత్ర పోషించనుండగా..
కృతి సనన్ సీత గా.. సైఫ్అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఈ స్ట్రెయిట్
హిందీ ఫిల్మ్ లో
ప్రభాస్ తప్ప మిగతా ప్రధాన నటీనటులందరూ కూడా
బాలీవుడ్ కి చెందినవారే.
ఈ
సినిమా మినహాయించి రాధేశ్యామ్, సలార్ వంటి చిత్రాలు కూడా
ప్రభాస్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా
ప్రశాంత్ నీల్ తో కలసి మరొక మైథాలజీకల్ ఫిల్మ్ ప్లాన్ చేసారని జోరుగా ప్రచారం జరుగుతోంది. "#ప్రభాస్25" పేరుతో అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మైథాలజీకల్ ఫిల్మ్ చేస్తున్నారని వార్తలు వస్తుండడంతో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. అదేంటంటే
ప్రభాస్ పౌరాణిక జానర్ పై
ప్రేమ పెంచుకుంటున్నారని.. అందుకే ఇప్పుడు రాముడు పాత్ర చేస్తూ.. త్వరలో మరొక పౌరాణిక పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. గతంలో ఎన్టీ రామారావు పౌరాణిక పాత్రలకు ఎంత చక్కగా సూట్ అయ్యారో
ప్రభాస్ కూడా సూట్ అవుతారని.. మోడ్రన్ ఎన్టీఆర్‌గా త్వరలోనే అవతారమెత్తుతారని నెటిజన్లు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి
ప్రభాస్ రామారావు లాగా పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటిస్తారో లేదో చూడాలి.