సక్సెస్‌ఫుల్
ప్రొడ్యూసర్ బన్నీ వాసు
అల్లు అర్జున్ తదుపరి సినిమాల లైన్ అప్ గురించి వెల్లడించిన విషయం తెలిసిందే.
బన్నీ వాసు అధికారికంగా
అల్లు అర్జున్ సినిమాల వివరాలు వెల్లడించడంతో అభిమానుల్లో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. అయితే
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల లైన్ అప్ చూస్తుంటే.. పుష్ప2, ఐకాన్
సినిమా పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఎందుకో వివరంగా తెలుసుకుంటే.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్న ఐకాన్ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారని గత కొంత కాలంగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల వేణు శ్రీరామ్ ఐకాన్
సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, ఇక ఐకాన్
సినిమా లేనట్టేనని రూమర్స్ హల్ చల్ చేశాయి. దీంతో బన్నీవాసు రంగంలోకి దిగి రూమర్స్ ని కొట్టిపారేశారు.
అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన లైన్అప్ ఆయన వెల్లడించారు.
ఆయన చెప్పిన ప్రకారం మొదటిగా పుష్ప పార్ట్ 1 విడుదల కానుండగా.. తర్వాత ఐకాన్
సినిమా విడుదల అవుతుంది. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఏ
హీరో కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ
సినిమా పార్ట్స్ ని వెంటవెంటనే రిలీజ్ చేశారు కానీ మధ్యలో మరేతర సినిమాలు విడుదల చేయలేదు. ఎందుకంటే మరింత ఆలస్యం చేస్తే
సినిమా రెండవ పార్ట్ పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ పుష్ప
సినిమా విడుదలై భారత దేశ వ్యాప్తంగా సూపర్ హిట్ అయితే.. ఐకాన్ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోతాయి. ఈ విధంగా చూసుకుంటే ఐకాన్
సినిమా పాన్
ఇండియా స్థాయిలో మంచి హైప్ ని క్రియేట్ చేయగలుగుతుంది.
కానీ ఒకవేళ పుష్ప పార్ట్ 1 ప్రేక్షకులను అలరించలేకపోతే.. ఐకాన్ సినిమాపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎన్నో అంచనాలతో విడుదలవుతున్న పాన్
ఇండియా మూవీ పుష్ప భారతదేశ ప్రేక్షకులను అలరించలేకపోతే
అల్లు అర్జున్ తదుపరి సినిమాలపై కూడా చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పుష్ప పార్ట్ 1
సినిమా రిలీజ్ చేసి.. ఆ తర్వాత పార్టు 2 విడుదల చేయకుండా ఐకాన్
సినిమా విడుదల చేయడం వల్ల మరో ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం ఉంది. అదేంటంటే, పార్ట్ 1-పార్ట్ 2 సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువైతే.. పార్ట్ 2 పాతబడిన సినిమాలా అనిపిస్తుంది. దీనివల్ల కూడా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మరి
అల్లు అర్జున్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. బహుశా
సుకుమార్ కమిట్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఆయనకు కాస్త విరామం ఇవ్వాలని
బన్నీ అనుకున్నారేమో.