పవన్ కళ్యాణ్ వరసపెట్టి సినిమాలు చేయాలి అనుకుంటే గత సంవత్సర కాలం పైగా దేశంలో భయపెడుతున్న కరోనా పరిస్థితులు పవన్ చేత ఒక్క అడుగు ముందుకు వేయిస్తే రెండు అడుగులు వెనకంజ వేసేలా పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొన్ని ప్రముఖ సంస్థలు పవన్ కళ్యాణ్ పై మరో సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.

కేంద్రంలో త్వరలో జరగబోయే మంత్రి వర్గ మార్పులలో ఆంధ్రప్రదేశ్ నుండి మిత్ర పక్షంగా జనసేన కు సంబంధించిన పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొన్ని  మీడియా సంస్థలు కథనాలు వ్రాస్తూ ఉండటంతో ఈవార్తలు ఎంతవరకు నిజం అన్న ఆతృత పవన్ అభిమానులలో రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం పవన్ చేతులో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి కనీసం ఒక సంవత్సర కాలం పట్టే ఆస్కారం ఉంది.


దీనితో సినిమాలోను మధ్యలో ఆపుచేసి పవన్ మంత్రి పదవి వైపు ఎలా వెళ్ళిపోతాడు అని అనిపించడం సహజం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మరో రెండు సంవత్సరాలలో దేశమంతా ఒకే ఎన్నికలు నినాదంతో ఒకేసారి అటు రాష్ట్రాలకు ఇటు పార్లమెంట్ కు ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దీనితో ఎన్నికలు ఒక సంవత్సరం ఉండగానే పవన్ మళ్ళీ జనంలోకి రావలసిన పరిస్థితులు కనపడుతున్నాయి.  

దీనికితోడు గత ఎన్నికలలో పవన్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలలోను ఓడిపోవడంతో ఈసారి పవన్ చాల ముందు చూపుతో తనకు ఖచ్చితమైన విజయం లభిస్తుంది అన్న అసెంబ్లీ స్థానాన్ని చాల ముందుగానే ఎంచుకుని అక్కడ గ్రాస్ రూట్ లెవల్ లో కార్యకర్తలతో చాల సన్నిహితంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకోవాలి. ఇలా జరగాలి అంటే పవన్ ఎన్నికల ముందు కనీసం ఒక సంవత్సర కాలం ముందుగా జనంలోకి రావలసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో పవన్ ఇప్పుడు అంగీకరించిన సినిమాలకు అదనంగా నిర్మాతలు ఎంత భారీ పారితోషికం ఆఫర్ చేసినా మరో సినిమాను ఒప్పుకునే అవకాశాలు లేవని దీనితో పవన్ మరిక ఎంతో కాలం సినిమాలలో నటించే అవకాశాలు లేవు అంటూ వస్తున్న వార్తలు పవన్ అభిమానులకు తీవ్ర కలవర పాటును కలిగిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: