బాలీవుడ్ సీనియర్ నటీమణి, బీజేపీ మంత్రి హేమా మాలిని 1970-80 కాలంలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆమె ఒక దశాబ్దం కాలం పాటు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటీమణిగా సంచలనం సృష్టించారు. పాండవ వనవాసం, శ్రీకృష్ణ విజయం వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. 72 ఏళ్ల ఈ సీనియర్ యాక్టర్ 2020 లో కూడా సిమ్లా మిర్చి అనే ఒక హిందీ ఫిలిం లో నటించారు. బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో గౌతమీ బాలశ్రీ గా ఆమె నటించి మెప్పించారు. అయితే ఈ సీనియర్ నటీమణి ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటూనే ఉంటారు. ఆమె అడపాదడపా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఒక ఓల్డ్ ఫోటోని పోస్ట్ చేశారు.



1969లో జానీ మేరా నామ్ అనే చిత్రం యొక్క ముహూర్త వేడుకలకు సంబంధించి ఆమె ఫోటో షేర్ చేశారు. ఫోటోలో ఈ సినిమాలో హీరో అయిన దివంగత నటుడు దేవానంద్, దర్శకుడు బీఆర్ చోప్రా, తదితర చిత్ర యూనిట్ కనిపించింది. అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అభిమానులతో పంచుకున్న హేమామాలిని ఒక పోస్ట్ రాశారు. 1969, ఫిబ్రవరి 2వ తేదీన ఫిలిం ముహూర్త సమయంలో తీసిన చిత్రమిది అని ఆమె వెల్లడించారు.



దివంగత సినీ నిర్మాత గుల్షన్ రాయ్, దివంగత దర్శకుడు ఆనంద్ విజయ్, సినిమాటోగ్రాఫర్ ఫైలి మిస్ట్రీ, అనంత స్వామి, శుభోద్, జీవన్ తదితరులు ఈ ఫోటో లో ఉన్నారని ఆమె వెల్లడించారు. ఈ ఫోటోలో హేమా మాలిని యొక్క 22 ఏళ్ల పడుచు అందాలను మనం చూడొచ్చు. 1970 లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ సినిమాల్లో ఒకటిగా జానీ మేరా నామ్ సినిమా నిలిచింది. అయితే మంచి స్టోరీలైన్ తో వచ్చిన ఈ సినిమాని తెలుగు లో ఎదురులేని మనిషి, తమిళం లో రాజా, కన్నడ లో అపూర్గ సంగమ పేర్లతో రీమేక్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: