తమిళ స్టార్ హీరో విశాల్ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నాట్ ఏ కామన్ మెన్'.విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమా నిర్మితం అవుతుంది.విశాల్ హీరోగా నటిస్తున్న 31 వ చిత్రం ఇది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.అక్కడ ఓ హోటల్ లో కొంతమంది రౌడీలతో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు.అందులో భాగంగావిశాల్ రౌడీలతో ఫైట్ చేస్తుండగా..వెనక నుంచి ఓ రౌడీ వచ్చి విశాల్ తలకి వెనక భాగాన బాటిల్ తో కొడతాడు.ఆ బాటిల్ పగిలి ముక్కలవుతుంది.

అందుకు రియాక్షన్ కూడా బాగా ఇచ్చాడట విశాల్.ఇక ఆ తర్వాత సన్నివేశంలో భాగంగా ఆ వ్యక్తే సగం పగిలిన బాటిల్ ని వెనక్కి వెళ్తూ..విశాల్ వైపు విసిరేస్తాడు.అది సూటిగా వచ్చి విశాల్ ఎడమ కంటికి తగిలింది.దాంతో అక్కడున్న రౌడీలంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు.దీంతో యాక్షన్ డైరెక్టర్ రవి వర్మ వెంటనే కట్ చెప్పాడు.ఇక ఆ తర్వాత షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు.ఇక కంటిలో గాజు ముక్కలు పడకుండా తగిన జాగ్రత్తలతో వాటిని పిచికారీ చేశారు.ఇక ఆ తర్వాత వెంటనే డాక్టర్ ని పిలిపించి విశాల్ కంటిని చెక్ చేయించారు. అదృష్ట వశాత్తు విశాల్ కంటికి పెద్దగా దెబ్బలేమి తగలలేదు.

ఇక ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో రౌడీలతో పాటూ.. అప్పుడప్పుడు హీరోలకి కూడా చిన్న చిన్న గాయాలవుతుంటాయి.అందుకే ఇలాంటి రిస్క్ తో కూడుకున్న సీన్స్ ని డూప్ లతో చేయిస్తారు.కానీ విశాల్ మాత్రం తన సినిమాల్లో డూప్ ని వాడడు.ఇక ఈ సంఘటన జరిగిన అనంతరం విశాల్.. రవివర్మ యాక్షన్ ఆధ్వర్యంలో జరిగిన ఆ రౌడీ ఫైటర్‌ను నీదేమీ తప్పులేదంటూ, అనుకోకుండా జరిగిందని కూల్‌గా చెప్పాడు.ఇక ఈ యాక్షన్ సీన్ కి సంబంధించిన ఓ వీడియో ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు విశాల్ ఇక ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హాయాతి హీరోయిన్ గా నటిస్తోంది.శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: