
రాజకీయాల్లో బిజీగా ఉంటూనే విజయశాంతి సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చి నటించడం మొదలుపెట్టారు. ఇటీవలే ఆమె మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. లేడీ సూపర్ స్టార్ గా అప్పట్లో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె అభిమానులకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది. ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు రాబోతున్నాయని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న రాజకీయ నేపథ్యంలో ని సినిమాలో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా విజయశాంతి నే అనుకుంటున్నారట.
ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రకటించిన ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనకంటూ హిస్టరీ ని క్రియేట్ చేసింది. విజయశాంతి అంటే పోరాటాలు చేయడం మాత్రమే కాదు గ్లామర్ హీరోయిన్ కూడా సత్తా చాటింది అని చెప్పే సినిమాలు ఎన్నో చేశారు. అలా ఆమె విశ్వ నట భారతి గా ఆల్ రౌండర్ గా అనిపిచుకుంది విజయశాంతి. కెరియర్ మొదట్లో ఎక్కువ గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన విజయశాంతికి నటిగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా నేటి భారతం. గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో నటి గా విజయశాంతికి మంచి బ్రేక్ వచ్చింది.
ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఎంతోమంది ఫామ్ లో ఉన్న హీరోయిన్ లను వెనక్కి నెట్టి స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ఇకపోతే విజయశాంతి హీరోయిన్ గా చేసే రోజుల్లోనే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈయనకు నందమూరి కుటుంబానికి సంబంధం ఉంది. శ్రీనివాస ప్రసాద్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు గణేష్ రావు కు స్వయానా మేనల్లుడు అవుతాడు. ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ సాన్నిహిత్యం తోనే బాలయ్య తో ఒక సినిమా నిర్మించాలనుకున్నాడు. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి కోదండరామిరెడ్డి దర్శకత్వంలో nippu ravva అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో చాలామది హీరోయిన్ లను పరిశీలించి చివరికి విజయశాంతిని ఎంపిక చేశారు. అక్కడ వాళ్ళ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.