
టాలీవుడ్ లో కొన్ని ఆసక్తికర కాంబినేషన్ లు ఇప్పుడు నెలకొంటున్నాయి. పరభాషా హీరోలు దర్శకులు మన టాలీవుడ్ దర్శకులతో, హీరోలతో సినిమాలు చేస్తూ కొంత వెరైటీ, కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం వెరైటీ అయితే ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇటు రామ్ పోతినేని కూడా లింగుస్వామి అనే తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.
అంతేకాకుండా మన దర్శకులు వంశీ పైడిపల్లి మరియు శేఖర్ కమ్ముల లు తమిళ హీరోలతో సినిమాలు ఓకే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త కాంబినేషన్ లో సినిమాలు ఎలా ఉంటాయో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ రాజకీయ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాను ఒప్పుకున్నారు. ఇటీవల ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాగా ఈ సినిమా కు ధనుష్ తీసుకునే రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలుగులో స్టార్ హీరోలు తీసుకుంటున్న పారితోషికానికి సమానంగా ఉంది ధనుష్ తీసుకునే రెమ్యునరేషన్. అయితే ఇతర తమిళ హీరోలు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇతర తమిళ హీరోలు అయినా కార్తీ, సూర్య, విజయ్, రజినీకాంత్, కమలహాసన్ వంటి హీరోలు ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి మార్కెట్ ను పెంచుకుంటే ధనుష్ మాత్రం రఘువరన్ బీటెక్ సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఇప్పుడు ఇన్ని కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇది ఒక ధనుష్ కి మాత్రమే సాధ్యమని తెలుగులో ఉన్న ఆయన అభిమానులు అంటున్నారు. డజన్ కొద్దీ సినిమాలను విడుదల చేసి ఇతర భాషల హీరోలు తెలుగులో మంచి మార్కెట్ ను సంపాదించుకుంటే ధనుష్ తన ఒకటి రెండు సినిమాలను డబ్ చేసి తెలుగు మార్కెట్ లో ఈ రేంజ్ ఇమేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు.