
మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజిని సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారానే సూర్య తెలుగు లోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సాధించుకున్నాడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనానికి బాలీవుడ్ సైతం మనసు పడింది. అందుకే అక్కడ అమీర్ ఖాన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కగా అక్కడ కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో కథానాయికగా ఆసిన్ నటించింది. మరో కథానాయికగా నయనతార నటించింది.
2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు మన ప్రేక్షకులు. ఈ సినిమాతో సూర్య సినీ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆయన నటన ప్రేక్షకులను మరింత దగ్గరయ్యేలా చేసింది. తెలుగులోనే కాకుండా తమిళం లోనూ ఆయన స్టార్ హీరోగా ఎదగడం లో ఈ సినిమా ఎంతో ఉపయోగపడింది. వెరైటీ కాన్సెప్ట్ తో మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య షార్ట్ టర్మ్ మెమరి లాస్ పేషెంట్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో సూర్య తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న పాత్ర ఆసిన్ , ఆ తరువాత నయనతార దే అని చెప్పాలి. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ పేషెంట్ ను అధ్యయనం చేసే ఓ డాక్టర్ పాత్రలో నయనతార బాగానే నటించింది. అయితే ముందుగా ఈ పాత్ర కోసం నయనతార అనుకోలేదట దర్శకుడు మురుగదాస్. ఈ పాత్రకోసం శ్రీయ ను అనుకున్నారట అయితే ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటం, డేట్స్ కుదరక పోవడంతో ఈ క్యారెక్టర్ నయనతార ని వరించిందట. అయితే మురుగదాస్ తనకు ఈ పాత్ర ముందుగా ఒకలా చెప్పి వేరేలా తెరకెక్కించాడని ఆవేదన చెందింది. మల్టీస్టారర్ సినిమాల్లో చేస్తున్నప్పుడు వాటిని జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్న గుణపాఠం గజిని సినిమా ద్వారా స్పష్టంగా తెలిసిందని తెలిపారు నయన్..
