మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు మంచి ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా మొత్తం న‌లుగురు మా ఎన్నిక‌ల్లో పోటీలో ఉండ‌డంతో చ‌తుర్ముఖ పోటీ అయితే నెల‌కొంది. ఇక నిన్న ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టి. మా ప్ర‌తిష్ట మ‌స‌క బారి పోయింది.. దీనిని కాపాడేందుకే తాము ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నామ‌ని.. ఇది మా అని మ‌న అంద‌రిది అని చెప్పారు. ఇక నాగ‌బాబు సైతం మెగాస్టార్ స‌పోర్ట్ ప్ర‌కాష్ రాజ్‌కే అని చెప్పేశారు. ఇక ఈ రోజు ఉద‌యం ప్ర‌కాష్ రాజ్‌, నాగ‌బాబుకు కౌంట‌ర్ గా న‌రేష్ ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌డంతో పాటు మంచు విష్ణుకు స‌పోర్ట్‌గా మాట్లాడారు.


ఇక రాంగోపాల్ వ‌ర్మ కూడా త‌న ట్వీట్ల‌తో ప్ర‌కాష్ రాజ్‌ను స‌పోర్ట్ చేస్తూ మాట్లాడారు. ప్ర‌కాష్ రాజ్ నాన్ లోక‌ల్ అయితే గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు వీళ్లంతా లోక‌లా ? అని ప్ర‌శ్నించ‌డంతో పాటు ప్ర‌కాష్ రాజ్‌కే త‌న స‌పోర్ట్ అని చెప్ప‌క‌నే చెప్పేశారు. ఇక ముందు లోక‌ల్‌, నాన్ లోక‌ల్ వివాదం వ‌చ్చిన‌ప్పుడు ఎక్కువ మంది మంచు విష్ణుకు ఇది ప్ల‌స్ అవుతుంద‌ని అంచ‌నా వేశారు.



అయితే క్ర‌మ‌క్ర‌మంగా ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. ప్ర‌కాష్ రాజ్‌కు పొలిటిక‌ల్ స‌పోర్ట్ కూడా పెరుగుతోంద‌ని అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ల‌లో ప్ర‌కాష్ రాజ్‌కే ఎక్కువ మంది స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. కేటీఆర్ తో పాటు సినిమా వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా ఉండే మ‌రో మంత్రి మ‌ద్ద‌తు సైతం ప్ర‌కాష్ రాజ్‌కే ఉంద‌ని అంటున్నారు. ఇక వైసీపీలో కూడా కొంద‌రు నేత‌ల మ‌ద్ద‌తు ప్రకాష్ రాజ్‌కే ఉంద‌ని టాక్ ?  మ‌రి నంద‌మూరి, ద‌గ్గుబాటి కాంపౌండ్ లు ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాయో ?  వీరి అంత‌రంగం ఏంటో ?  చూడాలి.


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: